రాజా చెల్లయ్య
రాజా చెల్లయ్య ( డిసెంబర్ 12, 1922 - ఏప్రిల్ 7, 2009) భారతదేశ ఆర్థికవేత్త. ఈయన మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు. ఈయన్ని పన్ను సంస్కరణల పితామహుడు అని పిలుస్తారు.[1]
రాజా చెల్లయ్య | |
---|---|
జననం | రాజా జేసుదాస్ చెల్లయ్య డిసెంబర్ 12, 1922 |
మరణం | 2009 ఏప్రిల్ 7 | (వయసు 86)
వృత్తి | ఆర్థికవేత్త. ఈయన మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు. |
జీవిత భాగస్వామి | సీత చెల్లియా |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు |
తొలినాళ్ళ జీవితం సవరించు
చెల్లయ్య 1922, డిసెంబర్ 12 న జన్మించాడు. ఈయన తన మాస్టర్స్ డిగ్రీని ఆర్థిక శాస్త్రం విభాగంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసాడు. ఈయన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేయడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌పై అమెరికాకు వెళ్లేముందు ఐదేళ్లపాటు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. ఈయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా లో పి.హెచ్.డి ని పూర్తి చేశాడు.[2]
పదవులు సవరించు
ఈయన 1969, 1975 మధ్య ఆర్థిక ద్రవ్య విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, అంతర్జాతీయ ద్రవ్య నిధికి చీఫ్‌గా పనిచేశాడు. ఈయన సెంటర్ ప్రావిన్షియల్ ఫైనాన్షియల్ రిలేషన్స్‌పై పాపువా న్యూ గినియా ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశాడు. ఈయన పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలలో కూడా పనిచేశాడు. ఈయన భారతదేశంలో పబ్లిక్ ఫైనాన్స్ నిపుణుడిగా పరిగణించబడ్డాడు.
వ్యక్తిగత జీవితం సవరించు
ఈయన సీత చెల్లయ్యను వివాహం చేసుకున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరణం సవరించు
ఈయన 2009 ఏప్రిల్ 7 న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. మృతదేహాన్ని సెయింట్ థామస్ మౌంట్ స్మశానవాటికలో ఖననం చేశారు.
మూలాలు సవరించు
- ↑ "Economist Raja Chelliah passes". The Times of India. 8 April 2009.
- ↑ Rao, S L (22 June 2010). "Father of tax reforms". The Hindu. Retrieved 8 December 2019.