రాజా మహేంద్ర ప్రతాప్

భారతీయ ఉద్యమకారుడు మరియు పత్రిక రచయత

రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ (1886 డిసెంబరు 1 - 1979 ఏప్రిల్ 29) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు,సామాజిక కార్యకర్త. 1915 లో కాబూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక భారత ప్రవాస ప్రభుత్వంలో అధ్యక్షుడిగా పనిచేసాడు.[1] 1940 లో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మహేంద్ర ప్రతాప్ జపాన్‌లో భారత కార్యనిర్వాహక మండలిని ప్రారంభించాడు. [2] ఇతని సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.. "ఆర్యన్ పేష్వా" అనే పేరుతొ ఇతను జనాదరణ పొందాడు. [3]

రాజా మహేంద్ర ప్రతాప్
రాజా మహేంద్ర ప్రతాప్

1979 లో భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపుపై రాజా మహేంద్ర ప్రతాప్


పదవీ కాలం
1915 December 1— 1919 జనవరి
పదవీ కాలం
1957–1962

లోక్‌సభ సభ్యుడు
నియోజకవర్గం మథుర

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
పూర్వ విద్యార్థి మింటో సర్కిల్

తొలినాళ్లలో

మార్చు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా గ్రామంలోని జమీందారు ఎస్టేట్లో 1886 డిసెంబర్ ఒకటో తారీకు న ప్రతాప్ సింగ్ జన్మించాడు. రాజా ఘనశ్యామ్ సింగ్ ఇతను మూడో కుమారుడు.

చదువు

మార్చు

1995లో అలీగడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  చదువు ప్రారంభించిన ప్రతాప్ సింగ్ ఆ తరువాత మొహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజియేట్ పాఠశాల (తరువాతి కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని పేరు మార్చబడింది) కు బదిలీ అయ్యాడు. 1905లో గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేయకుండా, ప్రతాప్ సింగ్ తన చదువును అక్కడితో ఆపేసాడు.[4]

1957 భారత సార్వత్రిక ఎన్నికలు: మథుర నియోజకవర్గం
Party Candidate Votes % ±%
Independent రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ [5][6] 95,202 40.68
INC చౌధురి దిగంబర్ సింగ్ 69,209 29.57
Independent పూరణ్ 29,177
ABJS అటల్ బిహారీ వాజపేయి 23,620 10.09

మూలాలు

మార్చు
  1. Gupta, Sourabh (28 November 2014). "3 surprising facts about Jat King at the centre of AMU row". India Today.
  2. Singh, Vir. Life and Times of Raja Mahendra Pratap. Low Price Publications (India). ISBN 9788188629329. Archived from the original on 2012-02-24. Retrieved 2021-09-21.
  3. "Raja Mahendra Pratap". India Post.
  4. "Explained: Battleground AMU; A Raja and his Legacy". The Indian Express. 29 November 2014. Retrieved 30 October 2015.
  5. "General Election, 1957 (Vol I, II)". Election Commission of India. Retrieved 2 March 2021.
  6. साहिल, अफ़रोज़ आलम (1 October 2019). "बीजेपी को जिन राजा महेंद्र प्रताप पर प्यार आ रहा है, उन्होंने वाजपेयी को हराया था". ThePrint Hindi. Retrieved 8 September 2021.