రాజా వరప్రసాద్ రావు వనారస

రాజా వరప్రసాద్‌ రావు వనారస తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 ఏప్రిల్ 15న తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

రాజా వరప్రసాద్ రావు వనారస

చైర్మన్
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్
పదవీ కాలం
2023 ఏప్రిల్ 15 – 07 డిసెంబర్ 2023[1]

వ్యక్తిగత వివరాలు

జననం 1980
షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం షాద్‌నగర్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాజా వరప్రసాద్ రావు 2001 నుండి టిఆర్ఎస్ స్థాపించిన నాటి నుండి పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశాడు. ఆయన 2001 నుండి 2007 వరకు షాద్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, 2007 నుండి 2010 యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుండి 2016 వరకు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

రాజా వరప్రసాద్ రావు సేవలను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఏప్రిల్ 15న తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా[3][4] ఏప్రిల్ 18న భాద్యతలు చేపట్టాడు.

మూలాలు

మార్చు
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (17 April 2023). "రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌గా రాజావరప్రసాద్‌రావు". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
  3. Telugu Prabha (16 April 2023). "తెలంగాణ సహకార యూనియన్ ఛైర్మన్ గా రాజావరప్రసాద్". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
  4. T News Telugu (16 April 2023). "రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.