రాజీవ్ గాంధీ హత్య

రాజీవ్ గాంధీ హత్య, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళనాడు లోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్ లో ఎల్.టి.టి.ఇకి చెందిన ఆత్మాహుతి దళం మే 21 1991 న హత్య గావించింది. ఈ ఉదంతంలో సుమారు 14 మంది హతులైనారు.[1] ఈ హత్యకు ప్రధాన సూత్రధారి తెన్మోజి రాజరత్నం. ఈమె థానుగా పిలువబడుతుంది. ఈ హత్యోదంతానికి శ్రీలంక లోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్.టి.టి.ఈ) సంస్థ ప్రధాన కారకులు.[2][3]

రాజీవ్ గాంధీ హత్య తరువాత మిగిలిన ఆయన ధరించిన దుస్తులు
శ్రీపెరంబదూర్ లో ఆయన హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న మొసాయిక్ రాయి

విశేషాలు

మార్చు

మాజీ ప్రదాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 1991 మే 21 వ తేదిన హత్య గావించాబడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మే 20 మధాహ్న సమయములో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా, ఆంధ్రాప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాలలో పర్యటించారు.

ఆయన పర్యటనకు వినియొగిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికి చివరికి మరమత్తులు చేయించి సాయంత్రం 6.30ని,, వైజాగ్ నుంచి బయలుదేరి చెన్నై చేరుకొన్నారు. సాయంత్రం 8.30ని, లకు స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మరకతం చంద్రశేఖర్ గారితో కలసి గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ (GWT) రోడ్దు ఆలయప్రాంగణములో ఉన్న సభాప్రాంగణానికి చేరుకున్నారు.

విపరీతంగా వచ్చిన జనాన్ని కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు వి.ఐ.పి లను కట్టుదిట్టమైన భద్రత ద్వారా ఆయన్ని కలవటానికి అనుమతించారు.అయినప్పటికి రాజీవ్ గాంధీకి తన కూతురు పాట వినిపించాలని వచ్చిన, మరకతం చంద్రశేఖర్ కూతురు దగ్గర పని చేసే లతకణ్ణన్ అనుమతి పొందిన వారితో పాటుగాథాను, శివరాజన్, హరిబాబులు (దర్యప్తులో ముఖ్యమైన ముద్దాయిలు గుర్తించబడ్డారు) కూడా వెళ్ళారు.థాను రాజీవ్ గాంధీ కాళ్ళకు నమస్కారం చేయటానికి వంగి తన నడుముకు ఉన్న RDX ప్రయోగించింది.ఆ విధంగా రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు. ఈ చర్య విచరణ జరపడానికి డి.ఆర్.కార్తికేయన్ (ఐ.పి.ఎస్.) గారి అధ్యక్షతన సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేశారు.ఈ కమిటి తన విచరణ హరిబాబు (ముద్దాయిలలో ఒకడు) తీసిన ఫొటొలు ఆధారంగా విచరణ ప్రారంభించారు. ఈ దర్యాప్తు బృంద విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వామ్యులు అందరు LTTE (Liberation Tigers Of Tamil Eelam) కు చెందిన వారుగా గుర్తించింది.అంతేకాక వీరిలో కొందరి దగ్గర దొరికిన సమాచరం ప్రకారం వీరంత రాజీవ్ గాంధీ మీద విపరీతమైన ఆవేశంతో ఉన్నారు. దినికి కారణం శ్రీలంక భద్రత విషయములో జొక్యం చేసుకొని LTTE పై విరుచుకుపడ్డారు.అంతేకాక డి.ఎమ్.కె (DMK) పార్టీ LTTE సహాయపడుతుంది అని ఆ పార్టీ అధికరాన్ని రద్దు చేసి రాస్ట్రపతి పాలన విధించడం.అతి ముఖ్యమైన కారణం రాజివ్ గాంధీ మరల అధికారంలోకి వచ్చి మరల ప్రధానమంత్రి అవటం దాదాపు ఖరార్ అవ్వటం.మరల ఆయన ప్రధాని అయితే LTTE మనుగడ కష్టమని భావించడము. వీరు ముఖ్య ముద్దాయిలు శివరాజన్, శుభలను వీరు ప్రాణాలతో పట్టుకొనలేకపోయారు.[4]

ఐపీఎస్ అధికారి కార్తికేయన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిట్ హత్య జరిగిన ఏడాదిన్నర తర్వాత నివేదిక సమర్పించారు. 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటోగ్రాఫులను పరిశీలించి, వేలాదిమంది సాక్షుల్లో 1044 మంది సాక్షుల వాంగ్మూలాలను ఉదహరిస్తూ, 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించింది.

ఈ కేసును సుప్రీం కోర్ట్ ధర్మాసనం న్యాయమూర్తులు కె.పిథమస్, ది.పి.వాధ్వా, సయ్యద్ షా మొహమ్మద్ ఖ్వాద్రిల ఆధ్వర్యంలో నాలుగు మాసాలు చర్చ అనంతరం 1995 మే 5 న తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు ఉరి శిక్ష, మరి కొందరిని జీవిత ఖైదు విధిస్తు ఇది ఉగ్రవాద చర్య కాదు అని అభిప్రాయపడింది.

రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి విడుద‌ల‌

మార్చు

రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభ‌విస్తున్న ఏజీ పెరరివాలన్‌ త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై తుది విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు అత‌డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభ‌వించిన ఏజీ పెరరివాలన్‌ను 2022 మార్చి 15న చెన్నైలోని జైలు అధికారులు విడుద‌ల చేశారు. దీంతో ఈ కేసులో తొలి బెయిల్ లభించిన వ్య‌క్తిగా అతను నిలిచాడు.[5]

మూలాలు

మార్చు
  1. "1991: Bomb kills India's former leader Rajiv Gandhi". BBC News. 1991-05-21. Archived from the original on 27 జూలై 2008. Retrieved 2008-08-05.
  2. J. Cooper, Kenneth (29 Nov 1997). "Leader Of India Falls From Power". www.sun-sentinel.com. Archived from the original on 14 జూలై 2014. Retrieved 3 Aug 2014.
  3. "TN to release all Rajiv convicts". Archived from the original on 4 మార్చి 2014. Retrieved 19 Feb 2014.
  4. నిప్పులాంటి నిజం(డి.ఆర్.కార్తికేయన్)
  5. Telugu, TV9 (2022-03-09). "Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకరికి బెయిల్.. 30 ఏళ్ల తర్వాత." TV9 Telugu. Retrieved 2022-03-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లింకులు

మార్చు