రాజేష్ క్షీరసాగర్
రాజేష్ వినాయకరావు క్షీరసాగర్ ( మరాఠీ : राजेश विनायकराव क्षीरसागर ) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొల్హాపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజేష్ క్షీరసాగర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | జయశ్రీ చంద్రకాంత్ జాదవ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొల్హాపూర్ నార్త్ | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
తరువాత | చంద్రకాంత్ జాదవ్ | ||
నియోజకవర్గం | కొల్హాపూర్ నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] | 1968 నవంబరు 24||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజేష్ క్షీరసాగర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్హాపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛత్రపతి మలోజీరాజే షాహూపై 3687 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కదం సత్యజిత్ శివాజీరావుపై 22,421 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
రాజేష్ క్షీరసాగర్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్హాపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ పండిట్ జాదవ్ చేతిలో 15,199 ఓట్ల తేడాతో ఓడిపోయి ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5] ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి మహావికాస్ అఘాడీ అభ్యర్థి రాజేష్ లట్కర్‌పై 29563 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Rajesh Kshirsagar".
- ↑ The Times of India (19 June 2024). "Ex-MLA sure of Sena win in Kolhapur North seat". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ Mid-day (3 December 2022). "Maharashtra: Real estate leader, neta to be MITRA vice-chairmen" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ The New Indian Express (2 December 2022). "CM Shinde appoints pal Ajay Ashar as vice president of Maharashtra Planning Commission" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Kolhapur North". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.