రాజ్ కుమార్ ఆనంద్

రాజ్ కుమార్ ఆనంద్ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. రాజకీయ నాయకుడు.[1] ఆయన 2020లో పటేల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 03 నవంబర్ 2022[2] నుండి 11 ఏప్రిల్ 2024 వరకు అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేశాడు.[3]

రాజ్ కుమార్ ఆనంద్
రాజ్ కుమార్ ఆనంద్


సాంఘిక సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలం
03 నవంబర్ 2022 – 11 ఏప్రిల్ 2024
Lieutenant Governor వినయ్ కుమార్ సక్సేనా
ముందు రాజేంద్ర పాల్ గౌతమ్
తరువాత TBA

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 ఫిబ్రవరి 2020
ముందు హజారీ లాల్ చౌహాన్
నియోజకవర్గం పటేల్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-09-14) 1966 సెప్టెంబరు 14 (వయసు 58)
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి వీణా ఆనంద్
పూర్వ విద్యార్థి బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం

రాజకీయ జీవితం

మార్చు

రాజ్ కుమార్ ఆనంద్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయిన ఆయన వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం ఆనంద్‌పథ్ ఫౌండేషన్‌ను స్థాపించి వివిధ సమజైక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2020లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పటేల్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 2022లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

ఆయన 11 ఏప్రిల్ 2024న మంత్రి పదవికి, ఆప్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[4]

మూలాలు

మార్చు
  1. The Times of India (11 April 2024). "Who is Raaj Kumar Anand: Delhi minister who resigned from govt and quit AAP". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  2. NDTV (4 November 2022). "AAP Leader Raaj Kumar Anand Takes Oath As Delhi Minister". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  3. NT News (10 April 2024). "ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. మంత్రి పదవికి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  4. The Hindu (10 April 2024). "Delhi Minister Raaj Kumar Anand turns on Kejriwal as he quits AAP" (in Indian English). Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.