రాజ రాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం (రాజమండ్రి)ని రాజధానిగా చేసుకొని పరిపాలన జరిపాడని చరిత్రకారులు చెబుతారు. రాజ రాజ నరేంద్రుడు 41 ఏళ్ళుపరిపాలన జరిపినా శాంతి సుస్థిరత లేదని చరిత్రకారులు చెబుతారు. ఈ రాజు పరిపాలనలో కవిత్రయం లో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు.