రాణి సదాశివమూర్తి

గారు కవి, వక్త, రచయిత, పరిశోధకులుగా ప్రసిద్ధి

ఆచార్య రాణి సదాశివ మూర్తి (Prof. Rani Sadasiva Murty) గారు కవి, వక్త, రచయిత, పరిశోధకులుగా ప్రసిద్ధి.ఆచార్య రాణి సదాశివ మూర్తి (Prof. Rani Sadasiva Murty) గారు కవి, వక్త, రచయిత, పరిశోధకులుగా ప్రసిద్ధి. సాహిత్య విభాగం, నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులు.[1] వీరు ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు.[2][3]

Prof. Rani Sadasiva Murty
ఆచార్య రాణి సదాశివ మూర్తి
జననంరాణి సదాశివ మూర్తి
30-11-1958
ఏనుగుల మహల్, కొత్తపేటతాలూకా, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంతిరుపతి, భారత దేశము India India
వృత్తిసంస్కృత ఆచార్యులు
ఉద్యోగంNational Sanskrit University, Tirupati, Andhra Pradesh
ప్రసిద్ధికవి, వక్త, పరిశోధకులు, సంపాదకులు, దర్శకులు
మతంహిందూ
భార్య / భర్తశ్రీమతి రాధామాధవి
పిల్లలుసుధాంశుశర్మ ,శ్రీహిత
తండ్రిడా. రాణి శ్రీనివాస శాస్త్రి
తల్లిశ్రీమతి శ్రీదేవి

జీవిత విశేషాలు

మార్చు

ఆచార్య రాణి సదాశివ మూర్తి గారు డా. రాణి శ్రీనివాస శాస్త్రి, శ్రీమతి శ్రీదేవి దంపతులకు 30-11-1958 రోజున ఏనుగుల మహల్, కొత్తపేటతాలూకా, తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి తల్లి శ్రీమతి శ్రీదేవి (1962లో హిందీలో పట్టభద్రురాలు), తండ్రి డా. రాణి శ్రీనివాస శాస్త్రి (జననం -:1922- స్వర్గస్థులైనది 2002- శతజయంతి మహోత్సవాలు 15-07-2022 జరిగాయి). వీరి శ్రీమతి రాధామాధవి M.Sc., (Life Sciences) చదువుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కుమారుడు సుధాంశుశర్మ (BTech NIT Warrangal), కుమార్తె శ్రీహిత (MA English Literature) and PG in Animations చదువుకున్నారు.

విద్యాభ్యాసం

మార్చు

ఆంధ్ర విశ్వ విద్యాలయంలో సంస్కృతంలో ఎం.ఏ పట్టభద్రులైనారు. "వైదిక ఛందస్సు"పై పరిశోధన చేసి పిహెచ్.డి అందుకొన్నారు. సంస్కృత, ఇంగ్లీష్లలో, ఫిలాసఫీ లలో ఎం.ఏ. డిగ్రీలను, వేదాంత విద్యాప్రవీణను, జ్యోతిష ఆచార్యను పొందిన పట్టభద్రులు. ఎం.బి.ఏ కూడా చేశారు. పిజి డిప్లొమా ఇన్ జర్మన్ కూడా చేశారు. హిందీలో విశారద చేశారు.

వృత్తి విశేషాలు

మార్చు

విశాఖపట్నం లో 1981 నుంచి 2000 సంవత్సరం వరకూ BVK Degree College, Dr. LB College, Andhra University Sanskrit Department లలో సంస్కృతాధ్యాపకులుగా 19 సంవత్సరాల కాలం పనిచేసి, 2000 సంవత్సరం నుండి ఈనాటి వరకూ (2000-2022) సాహిత్య విభాగం నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 6 వ తేదీ 2018 నుంచి ఫిబ్రవరి 12, 2021 వరకూ నేషనల్ సంస్కృత విశ్వ విద్యాలయం సాహిత్య విభాగానికి అధ్యక్షుని గా ఉన్నారు. 23-12-2018 నుంచి 22-12-2021 వరకూ నేషనల్ సంస్కృత విశ్వ విద్యాలయం లో డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ గా సేవలందించారు.

సంస్కృత సాహిత్య విమర్శ, వేద ఛందస్సు, ప్రాచ్య పాశ్చాత్య తత్త్వ శాస్త్రం, తంత్ర శాస్త్రం,సైన్స్, ఇండాలజీ, మోరాలజీ మొదలైనవాటిలో ప్రసిద్ధులు.

పురస్కారాలు , బిరుదులు

మార్చు
  • 1. 2016 సాహిత్య అకాడమీ అవార్డు (Sahitya Akademi Award)
  • 2. 2007 నాట్యరవళీ రాష్ట్ర ప్రతిభా పురస్కారం (Natyaravall State Talent Award)
  • 3. 2007 వ్యాస భారతి (Vyas Bharati)
  • 4. 2000 సంస్కృత బంధు (Samskrta Bandhu)
  • 5. 2005 విజయ్ శ్రీ (Vijay Shree)
  • 6. 2010 ప్రజ్ఞా భాస్కర (Prajna Bhaskara)
  • 7. 2017 కళ్యాణానంద భారతీ పురస్కారం
  • 8. 2018 వేద అవార్డు .. మిల్ పిటాస్ కాలి ఫోర్నియా
  • 9. 2020 లో సంచాలక సుధాకర బిరుదం సువిధా ఇంటర్నేషనల్ తెలుగు మిసిమి సంస్థ వారిచే శాక్రమేంటో, కాలిఫోర్నియా లో
  • 10. 2021 లో శ్రీమతి కోడూరి పార్వతీ మెమోరియల్ విశిష్ట పండిత పురస్కారం.. శ్రీమతి కోడూరి పార్వతీ మెమోరియల్ ట్రస్టు , సిరికొన సాహితీ సమితి, కాలిఫోర్నియా

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన ద్విశతావధాని, బహు గ్రంథకర్త స్వర్గీయ డా. రాళ్ళ బండి కవితా ప్రసాద్ రచించిన “ఒంటరి పూల బుట్ట” కవితా సంకలనాన్ని శ్రీ రాణీ సదాశివ మూర్తి సంస్కృతంలోకి అనువదించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి 50 వేల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని, తామ్ర పత్రాన్ని త్రిపురలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సదాశివ మూర్తి గారికి అందించి సత్కరించింది.[4]"ఇంతటి గుర్తింపు, గౌరవం దక్కటం జీవితంలో మరిచి పోలేను. ఇన్నాళ్ళుగా నేను సాగించిన సాహిత్య కృషి ఫలించింది అని భావిస్తాను" అని శ్రీ రాణీ సదాశివమూర్తి అత్యంత వినయంగా చెప్పారు.

రచనల జాబితా

మార్చు

రాణీ సదాశివమూర్తి గారు ఇప్పటిదాకా 40కి పైగా గ్రంథాలు రాశారు.

  • 1. వేద ఛందస్సు - దాని స్వభావం, మూలం, అభివృద్ధి (Vedic Prosody - Its Nature, Origin and Development)
  • 2. వదత సంస్కృతం (Vadata Samskritam)
  • 3. నవరత్న దీపిక (Navaratna Deepika)
  • 4. చాక్షుష యుగ్మం (Chakshusha Yugmam)
  • 5. శంకర స్తోత్ర రత్నావళి (Sankara Stotra Ratnavall)
  • 6. ధ్వన్యాలోక పారిభాషిక పద కోశం (Dhvayaloka Paaribhaashika Pada Kosh)
  • 7. ధ్వన్యాలోక కారికార్థ దర్శిని, కారికా సారశ్చ (Dhvanyaloka Karikaartha Darshini Kaarikaa Saarascha)
  • 8. 2018 కాత్య (హిమాలయ యోగినుల యథార్థ అనుభవాలకు కాల్పనిక సామాజిక కథనం) [5]
  • 9. ఆమ్లా (AMLA), అమోనోగ్రాఫ్ 2018 [6]

నాటక రచనలు (15)

మార్చు

సంస్కృతంలో, తెలుగు లో, ఆంగ్లంలో 15 రూపకాలను వ్రాసారు. వాటిలో సంస్కృతంలో శివపాణినీయం, జీవో బ్రహ్మైవ నాపరః, అగ్ని పుత్రాః వయం భారతాః ప్రసిద్ధిపొందాయి. తెలుగులో త్రిపురావిజయం, అపరాజిత, మల్లిక నవ్వింది, దేవుడే దిగివస్తే ప్రసిద్ధాలు. సంస్కృతంలో, తెలుగు లో, ఆంగ్లంలో 32 నృత్య రూపకములను రచించారు. అందుకని నాట్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్నవీరిని, నాట్య రవళి వంటి పలు సంస్థలు సత్కరించాయి.

నృత్య రూపకాలు

మార్చు
  • 1. నాట్యావిర్భావం (Natyavirbhavam)
  • 2. రాధామాధవీయం (Radhamadhavlyam)
  • 3. ఋతు సందేశం (తెలుగు) (Ritu Sandesa (Tel) )
  • 4. అర్థనారీశ్వర విలాసం (Arthanaarishvara Vilaasam)
  • 5. గౌతమి (Gautami)
  • 6. శాంతి శిల్పి (Santi Silpi)
  • 7. సరిద్విరాగం ( Saridviragam)
  • 8. విశ్వేశ్వర విజయం (Vishvesvara Vijayam)
  • 9. బుద్ధబోధామృతం (Buddhabodhamritam)
  • 10. ఆంధ్ర కళావిలాసం (Andhra Kalaavilaasam)
  • 11. ఋతు సందేశః (సంస్కృతం) (Rutu Sandesah (Sanskrit) )
  • 13. కాటనార్య విజయం (Kaatanaarya Vijayam)
  • 14. శ్రీ రామానుజ చరితం (Sri Ramaanuja Caritam)
  • 15. నవనీతగీత (Navanita Gita)
  • 16. రామానుజవిలాసం
  • 17. పద్మావతీ శ్రీనివాసం,
  • 18. సృష్టి తాండవవిలాసం
  • 19. శబరీమోక్షం,
  • 20. గంగాకలాపం

మొదలైన 32 నృత్యరూపకములను వ్రాసారు

సంస్కృత స్తోత్ర రచనలు

మార్చు
  • 1.శ్రీ శారదాస్తవ దాస శ్లోకి (Sri Saradastava Dasa Sloki)
  • 2. గాయత్రీ సుప్రభాతం (Gayatri Suprabhatam)
  • 3. జగన్నాథ సుప్రభాత స్తోత్ర మంజరి (Jagannatha Suprabhata Stotra Manjari)
  • 4. శ్రీ మాతృ వరివస్యా (Sri Maatru Varivasyaa)
  • 5. శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్తోత్రమంజరి (Sri Venkatesvara Suprabhaata Stotramanajari)
  • 6. శ్రీ వాస్తుపురుష అష్టోత్తర స్తోత్రం (Sri Vastupurusha Asthottara Stotram)
  • 7. గృహిణ్యష్టోత్తర శతనామావళీస్తోత్రం
  • 8. శ్రీ కాశీపురాధీశాశ్వధాటీ స్తోత్రం వంటి 250 స్తోత్రములను వ్రాసారు
  • 9. సంస్కృత గజల్స్, గీతాలు 18 వ్రాసారు (Sanskrit Gajals and sings)
  • 10. 2014 శ్రీ లక్ష్మీ గణపత్యష్టోత్తర శతనామావళీ స్తోత్రమ్

లఘు వచన కవితలు

మార్చు
  • 1. రాసమూర్తి సుద్దులు [7]
  • 2. చిన్న చమక్కులు,
  • 3. సామాన్యుడి మహావాక్యాలు [8]
  • 4 గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి హారతి పాట రచించారు.[9]

తెలుగులో 108 గీతాలు వ్రాసారు. 108 పెద్ద తెలుగు వచన కవితలు వ్రాసారు.

సంపాదకత్వం వహించిన పుస్తకాలు - 7

మార్చు
  • 1. విజ్ఞాన వైభవం (Vijnana Vaibhavam, )
  • 2. ఇండో-నేపాల్ సంస్కృత సదస్సు యొక్క సంగ్రహావలోకనాలు (Glimpses of Indo-Nepal Sanskrit Conference)
  • 3. వాక్యార్థ వైజయంతి (Vaakyaartha Vaijayanti)
  • 4. సంస్కృత విజ్ఞాన వైభవం (Samskrit Vijnana Vaibhavam)
  • 5. ఇంద్రియాలకు ప్రత్యేక సూచనతో పని సంస్కృతి, సమర్థత (Work Culture and Efficiencies with Special References to Indriyas)
  • 6. ప్రాచీన భారతీయ సైన్స్, ఆధునిక ప్రపంచానికి దాని ఔచిత్యం (Ancient Indian Science and its Relevance to the Modern World)
  • 7. జగ్గు వకుళభూషణ కావ్య మాల (Jaggu Vakulabhushana Kaavya maala)

పరిశోధనారంగంలో వీరు చేసిన కృషి

మార్చు

వివిధ దినపత్రికలు, మాసపత్రికలు, ప్రత్యేక సంపుటాలలో 200 కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. దేశ విదేశాలలో జరిగిన 80కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన పరిశోధనా పత్రాలను సమర్పించారు. 15కు పైగా సదస్సులకు తామే నేతృత్వం వహించారు. ప్రాచీన గ్రంథాలలోని అనేకానేకమైన వైజ్ఞానిక విశేషాలను ఎన్నో వ్యాసాల ద్వారా తెలియజేశారు. దూరదర్శన్, SVBC ఛానల్స్ లో 200 కంటే ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. 20 పిహెచ్.డి డిగ్రీలు,, 23 ఎమ్, ఫిల్ గ్రంథాలకు వీరు పరిశోధన మార్గదర్శకత్వం వహించారు. ఇద్దరు Post Doctoral Students కు కూడా మార్గదర్శనం చేశారు.

ప్రస్తుతం వీరు వ్రాసిన "అపర్యాప్తః సమయః" అనే సంస్కృత సామాజిక కథ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా రెండవ సంవత్సరంలో పాఠ్యాంశంగా ఉంచారు. మహాభారత ప్రతిస్థాన్, బెంగుళూరుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ సంపాదకులు సంస్కృతం, ఇతర ఆధునిక భాషల రంగానికి ఇంకా అనేక రికార్డ్ చేయబడిన, నమోదు చేయని సేవలు పురోగతిలో ఉన్నాయి.

వీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు

మార్చు
  • 1. హైపర్ లింక్‌లతో కూడిన మహాభారతం యొక్క ఎలక్ట్రానిక్ టెక్స్ట్ (Electronic Text of The Mahabharata with Hyper Links )
  • 2. గీత గోవింద ఆడియో ప్రాజెక్ట్, 10 కంటే ఎక్కువ ఆడియో ప్రాజెక్ట్ (Gita Govinda Audio Project and More than 10 Audio Project)

"హిడింబ భీమ సేనం” అనే సంస్కృత ఫీచర్ ఫిలింకు వీరు దర్శకత్వం వహించారు. "ఎలెక్ట్రానిక్ టెక్స్ట్ ఆఫ్ మహా భారత" అనే వీరి పరిశోధన చాలా విపులం. చాలా ప్రామాణికమైనది. అందులో 18 విషయాలపై శోధనకు అవకాశంతో కూడి ఉంది. అవి - పర్వ, ఉపాఖ్యాన, అధ్యాయ, శ్లోక శోధన, సారాంశ, చిత్ర ప్రదర్శన, అస్త్ర, యుద్ధ వ్యూహ మొదలైన వాటిపై విపుల శోధన ఇది. అంతేకాదు హరివంశంతో కూడా కలిసి ఉన్న 1 లక్షా పది వేల శ్లోకాల మహా భారతంపై మహా పరిశోధన ఇది. దీనికి ప్రొఫెసర్ శ్రీపాద సత్యనారాయణ మూర్తి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయితే, ఆచార్య సదాశివమూర్తి కో-ఆర్డినేటర్. ఒకే ఒక్క ఏడాదిలో ఈ బృహత్ పరిశోధన పూర్తి చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది.

విదేశీ పర్యటనలు

మార్చు
  • 1. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ (2004) (St. Peters Burg in Russia)
  • 2.నేపాల్‌లోని ఖాట్మండు (2008) (Khatmandu in Nepal)
  • 3. 2018లో, 2020లో రెండు సార్లు అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో, సంస్థల్లో ప్రసంగించారు.
  • 4. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ లో సభ్యులుగా నియమించబడ్డారు.

మూలాలు

మార్చు
  1. Department of Sahitya, National Sanskrit University, Tirupati, Andhra Pradesh
  2. ACHARYA RANI SADASIVAMURTHY TAKES OVER AS IN-CHARGE VC OF SV VEDIC UNIVERSITY _ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విసిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి
  3. "శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం... వీసీగా రాణి సదాశివమూర్తి". Archived from the original on 2023-01-16. Retrieved 2023-01-16.
  4. Akademi Award for scholar par excellence The Hans India, Andhra Pradesh, 7 Jan 2018
  5. "కినిగెలో రాణి సదాశివ మూర్తి గారి కాత్య పుస్తక వివరాలు". Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  6. "కినిగెలో రాణి సదాశివ మూర్తి గారి ఆమ్లా పుస్తక వివరాలు". Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  7. ఆర్కైవ్ లో రాణి సదాశివ మూర్తిగారి రాసమూర్తి సుద్దులు పుస్తక వివరాలు
  8. "కినిగెలో రాణి సదాశివ మూర్తి గారి సామాన్యుడి మహా వాక్యాలు పుస్తక వివరాలు". Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  9. Man who composed ‘Godavari Harati’ song, The Hindu, Andhra Pradesh, Tirupati: July 29, 2015

ఇతర లింకులు

మార్చు