రాధాకృష్ణ సంవాదము

రాధాకృష్ణ సంవాదం బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి పండితులైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించారు.[1] దీనిలో సమాకాలీనమైన విషయాన్ని వ్యక్తులతో చెప్పించడం గమనించదగిన విషయం. ఆ విధంగా వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచేంద్ర మహారాజుగారికి జరిగిన పట్టాభిషేక మహోత్సవాన్ని వర్ణించారు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. మొత్తం 594 పద్యాలున్నాయి. దీనిలో వెలుగోటివారి పూర్వవంశ వర్ణనతో ప్రారంభించి, శ్రీ రాజగోపాల కృష్ణ యచేంద్రుని పట్టాభిషేకం వరకు వివరింపబడింది. ఇది ప్రబంధాల వలె అష్టాదశ వర్ణనలతో కూడి ఉన్నది. శాస్త్రిగారి రచనా రమణీయానికి బొబ్బిలి మహారాజుగారి సభా వర్ణన సిసమాలిక, పట్టాభిషేక వర్ణన గొప్ప తార్కాణాలు. బొబ్బిలి మహారాజు గారి సైన్య వర్ణనలో తురంగ పల్లవ రగడను వాడడం వారి ఔచిత్యానికి, ఛందశ్సాస్త్ర పాండిత్యానికి నిదర్శనం.

కావ్యం లోని ఒక పద్యం మార్చు

ఉ. పొయఁడు లెక్క లోక్కటిగ రంగడరcగ మెఱుంగుపూఁతలతో
బూయఁడు భిత్తి భాగముల ముఖ్యపిధానము లందు మందతం
బాయఁడు బాంధవాదులగు వారికిఁ జేయఁగలట్టి సత్కృతుల్
చేయఁడు వే ఓ నా కిపుడు చెప్పఁగ నేటికి మీ రెఱుంగ రే.

మూలాలు మార్చు

  1. "Andhra kingdoms". www.vepachedu.org. Retrieved 2021-04-13.