రాబర్ట్ డి నోబిలీ
రాబర్ట్ డి నోబిలీ (1577 – 16 జనవరి 1656) 17వ శతాబ్దికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రబోధకుడు, సన్యాసి. ఆయన ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో(సిలోన్ వంటి ప్రాంతాల్లో కొన్నేళ్ళు) క్రైస్తవ మతాన్ని బోధిస్తూ జీవించారు. తత్త్వబోధానంద స్వామి అన్న పేరు పెట్టుకుని, హిందూ సన్యాసుల వేషంలో, వారి మతంలోని పదజాలాన్నే వాడుతూ ప్రజలను క్రైస్తవంలోకి తిప్పేవారు. అప్పటివరకూ ముందు ప్రచారం చేసిన క్రైస్తవ ప్రచారకులు విఫలం కాగా రాబర్ట్ డి నోబిలీ క్రైస్తవంలోకి ప్రజలను తీసుకురావడంలో విజయవంతం కావడంతో కొన్నేళ్ళపాటు భారతీయ క్రైస్తవ ప్రబోధకుల్లోనూ, ఆయనను పంపిన చర్చి ఆధ్యాత్మిక నేతల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఐతే మరికొందరు తోటి క్రైస్తవ ఫాదర్లు నోబిలీ హిందువుల ఆచారాలు, నమ్మకాలు అనుకరిస్తూ ప్రచారం చేయడం అసమంజసం అంటూ వాదన లేవదీయడంతో అదే క్రైస్తవ ప్రచారకుల్లో అపకీర్తి పాలు కూడా అయ్యారు. చివరకు హిందూసాధువులు, సన్యాసులు జీవించేలాంటి కష్టసాధ్యమైన జీవితం సాగించడంలో కలిగిన అనారోగ్యం వల్ల మరణించారు.
భారతదేశానికి ఆగమనంసవరించు
రాబర్ట్ డి నోబిలీ 1577 సెప్టెంబరులో మోన్టెపుల్కియానో, టస్కనీ ప్రాంతంలో జన్మించారు. ఆయన మే 20, 1605లో పశ్చిమ భారతంలోని గోవాకు చేరుకున్నారు. పోర్చుగీసుల పరిపాలనలోని గోవా అప్పటి భారతదేశంలోని క్రైస్తవ మిషన్లకు ముఖ్యకేంద్రంగా ఉండేది. ఆయన భారతీయ సంస్కృతికి, క్రైస్తవ మతానికి మధ్య సమన్వయాన్ని సాధించాలన్న ఆలోచనలో క్రీస్తపురాణమనే గ్రంథరచనలో ఉన్న ఫ్రాన్సిస్ థామస్ స్టీఫెన్స్‌ను కలిసివుంటారని చరిత్రకారుల భావన.[1] ఆపైన ఆయన భారతదేశంలో క్రైస్తవ మిషనరీగా చాలా విచిత్రమైన పద్ధతిలో పనిచేశారు.
తత్త్వబోధకస్వామిగాసవరించు
రాబర్ట్ డి నోబిలీ హిందూ సన్యాసి వేషభాషలు స్వీకరించి హిందువుల పద్ధతిలోనే క్రైస్తవాన్ని ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఆయన హిందూమతస్తులు అవలంబించే కొన్ని మత సాంస్కృతిక పద్ధతులను క్రైస్తవానికి ఆమోదయోగ్యమని ప్రకటించేవారు. ఈ వ్యవహారానికి పరాకాష్టగా తత్త్వబోధక స్వామిగా మార్చుకున్నారు.
నేపథ్యంసవరించు
ఆరోపణలు-విమర్శలుసవరించు
ప్రాచుర్యంసవరించు
మూలాలుసవరించు
- ↑ See N. Falcao, Kristapurana: A Christian-Hindu Encounter: A Study of Inculturation in the Kristapurana of Thomas Stephens, SJ (1549-1619), (Pune: Snehasadan / Anand: Gujarat Sahitya Prakash, 2003).