రాబర్ట్ పాటిన్సన్

రాబర్ట్‌ పాటిన్సన్‌ (జననం 1986 మే 13) (ఆంగ్లం: Robert Pattinson) ప్రముఖ హాలీవుడ్‌ నటుడు. హ్యారీ పోటర్‌, ట్విలైట్‌ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. ఘనవిజయం సాధించిన టెనెట్ లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో భారతీయ నటి డింపుల్‌ కపాడియా కూడా నటించింది.

రాబర్ట్ పాటిన్సన్
68వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(2018)లో రాబర్ట్ పాటిన్సన్
జననం
రాబర్ట్ డగ్లస్ థామస్ పాటిన్సన్

(1986-05-13) 1986 మే 13 (వయసు 38)
లండన్, ఇంగ్లాండ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
భాగస్వామిసుకి వాటర్‌హౌస్ (2018–ప్రస్తుతం)

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో రాబర్ట్‌ పాటిన్సన్‌ ఒకరు. 2010లో టైమ్ మ్యాగజైన్ అతన్ని ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. అతనికి ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో కూడా చోటు లభించింది.

15 సంవత్సరాల వయస్సులో లండన్ థియేటర్ క్లబ్‌లో రాబర్ట్ పాటిన్సన్ నటించడం ప్రారంభించాడు. ఆయన ఫాంటసీ చిత్రం హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్ (2005)లో సెడ్రిక్ డిగ్గోరీ పాత్రను పోషించడం ద్వారా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు. అతను ది ట్విలైట్ సాగా ఫిల్మ్ సిరీస్ (2008–2012)లో ఎడ్వర్డ్ కల్లెన్ పాత్ర పోషించినందుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా $3.3 బిలియన్లకు పైగా వసూలు చేసింది. రొమాంటిక్ డ్రామాలు రిమెంబర్ మి (2010), వాటర్ ఫర్ ఎలిఫెంట్స్ (2011)లో నటించిన తర్వాత, రాబర్ట్ పాటిన్సన్ ఆట్యూర్ దర్శకుల నుండి స్వతంత్ర చిత్రాలలో పనిచేయడం ప్రారంభించాడు. డేవిడ్ క్రోనెన్‌బర్గ్ థ్రిల్లర్ కాస్మోపాలిస్ (2012), జేమ్స్ గ్రే అడ్వెంచర్ డ్రామా ది లాస్ట్ సిటీ ఆఫ్ Z (2016), సఫ్డీ బ్రదర్స్ క్రైమ్ డ్రామా గుడ్ టైమ్ (2017), క్లైర్ డెనిస్ సైన్స్-ఫిక్షన్ డ్రామా హై లైఫ్‌(2018)లో అతను నటించినందుకు ప్రశంసలు అందుకున్నాడు. రాబర్ట్ ఎగ్గర్స్ భయానక మానసిక చిత్రం ది లైట్‌హౌస్ (2019), క్రిస్టోఫర్ నోలన్ గూఢచారి చిత్రం టెనెట్ (2020)లో ప్రధాన పాత్రతో ప్రధాన స్రవంతి చిత్రాలకు తిరిగి వచ్చాడు. మాట్ రీవ్స్ సూపర్ హీరో చిత్రం ది బాట్‌మాన్ (2022)లో బాట్‌మ్యాన్‌గా నటించాడు.

నటనతో పాటు, రాబర్ట్ పాటిన్సన్ సంగీతాన్ని కూడా ప్లే చేస్తాడు. సినిమాల కోసం అనేక సౌండ్‌ట్రాక్‌లలో పాడాడు. అతను GO క్యాంపెయిన్‌తో సహా అనేక స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తాడు. అంతేకాకుండా 2013 నుండి డియోర్ హోమ్ ప్రాగ్రాన్స్ ను నిర్వహిస్తున్నాడు.

జీవితం తొలి దశలో

మార్చు

986 మే 13న రాబర్ట్ పాటిన్సన్ లండన్‌లో జన్మించాడు.[1][2] అతని జన్మనామం రాబర్ట్ డగ్లస్ థామస్ పాటిన్సన్.[3][4] మోడలింగ్ ఏజెన్సీలో స్కౌట్ అయిన క్లేర్ (చార్ల్‌టన్), వింటేజ్ కార్ల వ్యాపారి రిచర్డ్ పాటిన్‌సన్‌ల ముగ్గురు పిల్లలలో రాబర్ట్ పాటిన్సన్ చిన్నవాడు.[5] అతను బార్న్స్‌లోని ఒక చిన్న ఇంటిలో ఇద్దరు అక్కలు ఎలిజబెత్ (లిజ్జీ), విక్టోరియాతో పెరిగాడు.[6] రాబర్ట్ పాటిన్సన్ నాలుగేళ్ల వయస్సులో గిటార్, పియానో ​​నేర్చుకోవడం ప్రారంభించాడు.[7] అతను టవర్ హౌస్ స్కూల్‌లో చదివాడు. ది హారోడియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు.[8][9] యుక్తవయసులో తన పాకెట్ మనీ కోసం బ్రిటిష్ ఫ్యాషన్ బ్రాండ్‌లు, మ్యాగజైన్‌లకు ఫోటో మోడల్‌గా పనిచేశాడు లండన్ చుట్టూ ఉన్న పబ్‌లలో ఓపెన్ మైక్ నైట్‌లలో ఎకౌస్టిక్ గిటార్ గిగ్స్‌ను ప్రదర్శించాడు. సినిమాపై మమకారం పెంచుకున్నాడు, జాక్ నికల్సన్, మార్లోన్ బ్రాండో, జీన్-పాల్ బెల్మోండోలను ఆరాదించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాబర్ట్ పాటిన్సన్ తన వ్యక్తిగత జీవితం బహిర్గతం అవడం ఇష్టపడడు. అందుకని మీడియాకి దూరంగా ఉంటాడు.[10] జీవితం తొలి దశలో పడ్డ ఇబ్బందులను మొదటిసారిగా 2017లో ప్రజల దృష్టికి తీసుకొచ్చాడు.[11] 2020 సెప్టెంబరులో COVID-19 సోకింది. దీంతో ది బ్యాట్‌మ్యాన్ చిత్రీకరణ కొన్నాళ్ళు నిలిపివేయబడింది.[12]

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Title Role Notes
2004 వానిటీ ఫెయిర్ రౌడీ దృశ్యాలు తొలగించారు
2005 హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్ సెడ్రిక్ డిగ్గోరీ
2008 హౌ టు బి కళ
ట్విలైట్ ఎడ్వర్డ్ కల్లెన్
2009 లిటిల్ యాషెస్ సాల్వడార్ డాలీ
ట్విలైట్ సాగా: న్యూ మూన్ Edward Cullen
2010 రిమెంబర్ మి టైలర్ హాకిన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా
ట్విలైట్ సాగా: ఎక్లిప్స్ ఎడ్వర్డ్ కల్లెన్
లవ్ & డిస్ట్రస్ట్ Richard
2011 వాటర్ ఫర్ ఎలిఫెంట్స్ జాకబ్ జాంకోవ్స్కీ
ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ – పార్ట్ 1 ఎడ్వర్డ్ కల్లెన్
2012 బెల్ అమీ జార్జెస్ దురోయ్
కాస్మోపోలిస్ ఎరిక్ ప్యాకర్
ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ – పార్ట్ 2 ఎడ్వర్డ్ కల్లెన్
2014 ది రోవర్ రేనాల్డ్స్
మ్యాప్స్ టు స్టార్స్ జెరోమ్ ఫోంటానా
2015 క్వీన్ ఆఫ్ ది డిజర్ట్ T. E. లారెన్స్
లైఫ్ డెన్నిస్ స్టాక్
2016 ది చైల్డ్ హుడ్ ఆఫ్ ఎ లీడర్ చార్లెస్ మార్కర్
ది లాస్ట్ సిటీ ఆఫ్ Z హెన్రీ కాస్టిన్
2017 గుడ్ టైమ్ కాన్స్టాంటైన్ "కానీ" నికాస్
ఫియర్ & షేమ్ అతనే షార్ట్ ఫిల్మ్; రచయిత కూడా
2018 డామ్సెల్ శామ్యూల్ అలబాస్టర్
హై లైఫ్ మోంటే
2019 ది లైట్ హౌస్ ఎఫ్రైమ్ విన్స్లో / థామస్ హోవార్డ్
ది కింగ్ డౌఫిన్
వెయిటింగ్ ఫర్ ది బార్బేరియన్స్ ఆఫీసర్ మాండెల్
2020 టెనెట్ నీల్
ది డెవిల్ ఆల్ టైమ్ ప్రెస్టన్ టీగార్డిన్
2022 ది బాట్మాన్ బ్రూస్ వేన్ / బాట్మాన్

పురష్కారాలు

మార్చు

హౌ టు బిలో రాబర్ట్ పాటిన్సన్ నటనకు స్ట్రాస్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.[13] ది ట్విలైట్ సాగాలో అతని పనికి, అతను రెండు ఎంపైర్ అవార్డు ప్రతిపాదనలను సంపాదించాడు పదకొండు MTV మూవీ అవార్డ్స్, రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్‌తో పాటు అదనపు అవార్డ్‌లు అందుకున్నాడు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా 2009 హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్‌ని గెలుచుకోవడంతో పాటు నామినేషన్‌లను గెలుచుకున్నాడు. 2014లో అతను ఆస్ట్రేలియన్ అకాడమీ అవార్డ్స్ (AACTA), కెనడియన్ స్క్రీన్ అవార్డ్స్ నుండి వరుసగా ది రోవర్, మ్యాప్స్ టు ది స్టార్స్ లో తన నటనకు నామినేషన్లు పొందాడు. అతను 2015లో డ్యూవిల్లే అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి లైఫ్‌లో తన నటనకు హాలీవుడ్ రైజింగ్ స్టార్ అవార్డును గెలుచుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. "Monitor". Entertainment Weekly. No. 1207. 18 May 2012. p. 29.
  2. "Robert Pattinson". People. Archived from the original on 29 July 2010. Retrieved 3 April 2009.
  3. "Getting to know the "Twilight" actors". Newsday. 2008. Archived from the original on 20 November 2011. Retrieved 3 May 2008.
  4. "Robert Pattinson Biography". The Biography Channel UK. The Biography Channel. A&E Television Networks and Disney-ABC Television Group. Archived from the original on 5 July 2013. Retrieved 21 May 2013.
  5. Stenning, Paul (2010). The Robert Pattinson Album. Plexus. ISBN 978-0859654388.
  6. Tibbetts, Graham (2 December 2008). "Profile of Twilight star Robert Pattinson". Daily Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Archived from the original on 6 June 2019. Retrieved 6 June 2019.
  7. Biography Today. Detroit, Michigan: Omnigraphics. 2009. p. 136. ISBN 978-0-7808-1052-5.
  8. "Biography Today", p.136
  9. Flora Stubbs (17 November 2005). "Potter star 'next Jude Law'". London Evening Standard. Archived from the original on 28 September 2008. Retrieved 2 October 2008.
  10. "Robert Pattinson doesn't want to talk about his relationships". Inquisitr.
  11. "Robert Pattinson opens up about having anxiety and going to therapy". Telegraph UK. Archived from the original on 10 January 2022.
  12. "Robert Pattinson has Covid-19, halting The Batman production". Vanity Fair.
  13.   https://en.wikipedia.org/wiki/List_of_awards_and_nominations_received_by_Robert_Pattinson. వికీసోర్స్.