రాబర్ట్ పియరీ
రాబర్ట్ ఎడ్విన్ పియరీ (జననం: మే 6, 1856 - మరణం: ఫిబ్రవరి 20, 1920) ఏప్రిల్ 6, 1909 నాడు, భౌగోళిక ఉత్తర ధృవం చేరుకున్న మొదటి అన్వేషక యాత్రికుడని చెప్పుకుంటున్న ఒక అమెరికన్ అన్వేషకుడు. పియరీ మే 6, 1856 న క్రిస్సన్, పెన్సిల్వేనియాలో జన్మించాడు.[1] ఇతను పోర్ట్లాండ్, మైనేలో పెరిగారు. పియరీ బౌడోయిన్ కళాశాలలో విద్యను అభ్యసించాడు. ఇతను 1888 లో జోసెఫిన్ డైబిట్స్‌చ్ ను పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరికి కలిపి ఇద్దరు పిల్లలు. అలేక్వసినాకు, ఈయనకు కలిపి మరొక పిల్లవాడితో కలిపి మొత్తం ఈయనకు ముగ్గురు పిల్లలు. పియరీ 63 సంవత్సరాల వయస్సులో అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 20, 1920 న వాషింగ్ టన్ డి.సి.లో మరణించాడు.