రామకోటి
రామకోటి అంటే శ్రీరామ అనే పదాన్ని కోటి సార్లు రాయడం. శ్రద్ధాభక్తులు ఉన్నవారు ఎవరైనా దీన్ని రాయవచ్చు. రాసిన తరువాత శ్రీరామాలయాలలో లేదా ఇతర పుణ్య క్షేత్రాలలో రామకోటి పుస్తకాలు భద్రపరిచే చోట సమర్పించి వస్తారు. తెలుగువారికి భద్రాచలం ముఖ్యమైన రామక్షేత్రం కాబట్టి సాధారణంగా ఇక్కడ సమర్పించి వస్తారు. అక్కడి మూల మూర్తులకు అభిషేక పూజాదులు నిర్వహించి, పుస్తకాలను పూజిస్తారు. కోటి పూర్తయిన తర్వాత కూడా జీవిత పర్యంతం రాసేవారున్నారు.
నియమాలు
మార్చురామకోటిని రాయడానికి ఉపక్రమించే ముందు సాధారణంగా ఈ కింది నియమాలు పాటిస్తారు.
- శుచి శుభ్రతలు (స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి) కలిగి ఉండాలి.
- రాసేటప్పుడు దిక్కలు చూస్తూనో అనవసరమైన మాటలు మాట్లాడటమో చేయకూడదు.
- నేలపై కూర్చుని, పడుకుని రాయకూడదు
- నల్లరంగులో రాయకూడదు. నీలం కానీ ఆకు పచ్చ రంగు కానీ మంచివి.
- పద్మాసనం వేసుకుని కూర్చుని రాయాలి
- అంటు, మైల, పురుడు ఉన్న రోజులలో రాయకూడదు.
మంచి పద్ధతులు
మార్చు- రామకోటి పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి అదే నక్షత్రం రోజు ముగిస్తే మంచిది.
- పూర్తి చేసిన రోజు అన్న సంతర్పణ చేయడం మంచిది.
- సాయంకాలం స్నానం చేసి భోజనానికి ముందు రాయడం మంచి పద్ధతి.[1]
మూలాలు
మార్చు- ↑ TTD, Ebooks. "TTD-E-Books". ebooks.tirumala.org. తి.తి.దే. Archived from the original on 26 ఏప్రిల్ 2016. Retrieved 16 April 2016.