రామాంజనేయ యుద్ధం (నాటకం)

రామాంజనేయ యుద్ధం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం. ఈ నాటకంలో పరమ రామ భక్తుడైన హనుమంతుడు యయాతి ని రక్షించడం కోసం రామునితో యుద్ధానికి సన్నద్దం కావల్సి వస్తుంది. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు.

రామాంజనేయ యుద్ధంలోని సన్నివేశం.
రామాంజనేయ యుద్ధంలోని సన్నివేశం.

కథ మార్చు

ఒక సారి పాండవుల పూర్వీకులలో ఒకడైన యయాతి మహారాజు వేటకు వెళతాడు. అలా వేటాడుతుండగా ఆయకు వశిష్ట మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి అక్కడికి వెళతాడు. తరువాత మరి కొద్ది దూరంలో ఉన్న విశ్వామిత్రుడి దగ్గరకు కూడా వెళతాడు. సహజంగా కోపిష్టియైన విశ్వామిత్రుడు యయాతి ముందుగా తన దగ్గరకు రాకుండా వశిష్టుని దగ్గరకు వెళ్ళాడని తెలిసి తన శిష్యుడైన రామచంద్రుని దగ్గరకు వెళ్ళి తనను అవమానించిన వాని పరాభవించమని కోరతాడు. విషయమంతా పూర్తిగా తెలియని శ్రీరాముడు తన గురువుకు అవమానం కలిగించిన వానిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు.

ఇది తెలుసుకున్న యయాతి నారద మహర్షి సలహా మేరకు ఆంజనేయుని దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా తన ప్రాణాలను కాపాడమని అడుగుతాడు. ఆంజనేయుడు అందుకు అంగీకరిస్తాడు. అలా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు విశ్వామిత్రునితో సహా అందరూ భక్తి యొక్క మహత్యాన్ని తెలుసుకుంటారు. శ్రీరాముని పరమ భక్తితో పూజించిన ఆంజనేయుడిని ఆయన ప్రభువు కూడా ఓడించలేకపోయాడు. అది భక్తికున్న శక్తి అని ఈ కథ నిరూపిస్తుంది.[1]

నాటకాలు మార్చు

ఈ ఇతివృత్తాన్ని అనుసరించి తెలుగులో అనేకులు నాటకాలు రచించారు. ఆయా నాటకాల జాబితా ఇది:

  • హనుమద్రామ సంగ్రామము అనే గ్రంథాన్ని ఎన్.పార్థసారధిశర్మ రచించారు.[2]
  • హనుద్రామ సంగ్రామము లేక రామాంజనేయ యుద్ధము అనే పేరుతో నాటకాన్ని ద్రోణంరాజు సీతారామారావు రచించారు.[3]
  • డి.లక్ష్మీనరసింహం 1930 సంవత్సరంలో హనుమద్రామ సంగ్రామము లేక రామాంజనేయ యుద్ధమనే పేరుతోనే నాటకాన్ని రచించారు.[4]

మూలాలు మార్చు

  1. ఎ.ఆర్.ఎస్. (ఆగస్టు 16, 2006). "Creditable fare". ది హిందూ. Retrieved 27 October 2014.
  2. ఎన్., పార్థసారధిశర్మ (1940). హనుమద్రామ సంగ్రామము. p. 1. Retrieved 27 October 2014.
  3. ద్రోణంరాజు, సీతారామారావు (1922). రామాంజనేయ యుద్ధము. Retrieved 27 October 2014.
  4. డి, లక్ష్మీనరసింహం (1931). హనుమద్రామ సంగ్రామము. p. 1. Retrieved 27 October 2014.