రామాభ్యుదయము ఒక తెలుగు ప్రబంధము. దీనిని అయ్యలరాజు రామభద్రుడు రచించారు. ఇది ఎనిమిది ఆశ్వాసాల బృహత్ప్రబంధం; ఇందులో పద్దెనిమిది వందలకు పైగా పద్యాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన గ్రంథ ముఖ చిత్రము

కథా సంగ్రహం మార్చు

రామకథ ఇందులోని ప్రధాన ఇతివృత్తం. దశరథుని జీవితంలోని యౌవనం మొదటి రెండు ఆశ్వాసాల్లో పేర్కొన్నారు. రామపట్టాభిషేకంతో గ్రంథం ముగుస్తుంది. ఉత్తర రామాయణం ఇందులో చేర్చలేదు.

శైలి మార్చు

కవి శైలిలో సంస్కృతం, తెలుగు రెండూ మనోజ్ఞమైన మైత్రి చేసుకుంటాయి. అచ్చతెలుగు వాడినా అది కృతక పాండిత్యపు చచ్చుతెలుగులా ఉండదు. పదిమంది మెచ్చుతెలుగులా ఉంటుంది. "కల్లోల డోలా సముల్లోల లీలాస రాళమరాళవా చాల ఝరము" వంటి రచనలో ఉయ్యాలలూగే శైలితోపాటు సంస్కృత భాషా మాధుర్యం గూడా జోలపాడుతుంది. సురలు శ్రీమన్నారాయణుని సేవించిన ఘట్టంలో రామభద్రుడు పోయిన పోకడలు చూపిన శైలీ విన్యాసాలు బహువర్ణచిత్రాలు.

ఒక్క స్వయంపాకం తప్ప అన్ని పాకములు ఈ గ్రంథమున గలవని చెళ్లపిళ్లవారి ప్రశంసా చమత్కారము.