రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి వ్రాసిన కథల సంపుటి

రామేశ్వరం కాకులు తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి వ్రాసిన కథల సంపుటి. దీనిలో 12 కథలు ఉన్నాయి. ఈ పుస్తకానికి 2023వ సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1]

రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు
రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పుస్తకం ముఖచిత్రం
కృతికర్త: తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి
అంకితం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సంపుటి
ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్, హైదరాబాదు
విడుదల: 2020
పేజీలు: 130

రచయిత గురించి

మార్చు

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి తెలుగు రచయిత, పర్యావరణవేత్త. 1945లో పిఠాపురంలో జన్మించాడు. పురావస్తుశాస్త్రంలో డాక్టరేట్ చేశాడు. అమలాపురం డిగ్రీ కాలేజీలో అధ్యాపకునిగా పని చేసి, ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యావణవేత్తగా పనిచేస్తున్నాడు. ఇతడు ఈ కథా సంపుటంతో పాటు నలుపెరుపు, వడ్లచిలకలు, తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి కథలు అనే కథాసంపుటాలు, గేదె మీద పిట్ట, వీరనాయకుడు, దేవర కోటేశు, హోరు మొదలైన నవలలు, మాధవి, సూదిలోంచి ఏనుగు, అమ్మా! ఎందుకేడుస్తున్నావు? వంటి నాటకాలు, గుండె గోదారి అనే కవితా సంపుటి వెలువరించాడు. కొండేపూడి శ్రీనివాసరావు సాహితీసత్కారం, రావిశాస్త్రి అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న (హంస) పురస్కారం వంటి పురస్కారాలను పొందాడు.

ఇతివృత్తం

మార్చు

ఈ పుస్తకంలో 12 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ ఇంతకు ముందు పత్రికలలో ప్రచురింపబడినవే. విస్తృతమైన కథా వస్తువులు, వైవిధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథలలో కనిపిస్తుంది. మానవ జీవితంలోని వివిధ పార్శాలను ఈ కథలు ప్రతిబింబిస్తున్నాయి.

  • రామేశ్వరం కాకులు[2]
  • కె.ఎల్.గారి కుక్కపిల్ల
  • మంచుగాలి
  • గారా
  • రోహిణి[3]
  • అతను
  • అతనూ, ఆమే, ఏనుగూ
  • అతని శీతువు[4]
  • అతని వెంట
  • కచ్ఛప సీత[5]
  • ఉర్వి
  • వెన్నెల వంటి వెలుతురు గూడు

అభిప్రాయాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. న్యూస్ టుడే (21 December 2023). "తల్లావజ్ఝల పతంజలిశాస్త్రికి కేంద్ర సాహితీ పురస్కారం". ఈనాడు దినపత్రిక. Retrieved 27 November 2024.
  2. web master. "రామేశ్వరం కాకులు - తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి". కథానిలయం. Retrieved 27 November 2024.
  3. web master. "రోహిణి - తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి". కథానిలయం. Retrieved 27 November 2024.
  4. web master. "అతని శీతువు తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి". కథానిలయం. Retrieved 27 November 2024.
  5. web master. "కచ్ఛప సీత - తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి". కథానిలయం. Retrieved 27 November 2024.