రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట

పాట సారాంశం మార్చు

ఈ పాటలో చుట్టు పక్కల ఉన్న గుళ్ళు వాటి పేర్లు చెపుతూ వాటి వివరాలు వర్ణిస్తూ పడుకునే పాట. ఇది ఒల జానపద గీతo. ఉంటారు.[1] [2]

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో మార్చు

రామ రామ రామ ఉయ్యాలో | రామనే శ్రీరామ ఉయ్యాలో||
రామ రామ నంది ఉయ్యాలో | రాగమేత్తరాదు ఉయ్యాలో||
నేత్తిమీద సూర్యుడా ఉయ్యాలో | నేలవన్నేకాడ ఉయ్యాలో||
పాపిటలో చెంద్రుడా ఉయ్యాలో | బలాకుమరుడా ఉయ్యాలో||
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో | పెత్తరామానము ఉయ్యాలో||
బాలలకు వచ్చింది ఉయ్యాలో | బతుకమ్మ పండుగ ఉయ్యాలో||
తెల్ల తెల్లయీ గుళ్ళు ఉయ్యాలో | తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో||
పన్నెండేండ్ల కింద ఉయ్యాలో | పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో||
తెల్లయీ వేములవాడ ఉయ్యాలో | రాజన్న గుళ్ళు ఉయ్యాలో||
నల్ల నల్లయీ గుళ్ళు ఉయ్యాలో | నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో||
నల్లయీ నల్లగొండ ఉయ్యాలో | నరసింహ గుళ్ళు ఉయ్యాలో||
పచ్చ పచ్చయీ గుళ్ళు ఉయ్యాలో | పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో||
పచ్చయీ పరకాన ఉయ్యాలో |మల్లన గుళ్ళు ఉయ్యాలో||
పర్వతాల మల్లన ఉయ్యాలో |పదములు సెలవయ్య ఉయ్యాలో||
రామ రామ రామ ఉయ్యాలో | రామనే శ్రీరామ గుళ్ళు ఉయ్యాలో||

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-18. Retrieved 2017-09-20.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-22. Retrieved 2017-09-20.