రాయ్‌గఢ్ జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా
(రాయగఢ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

రాయగఢ్ జిల్లా , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లా. రాయగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో చత్తీస్గరీ, హిందీ, ఒరియా భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లా రైల్వే, పారిశ్రమిక అభివృద్ధిపరచబడిన తరువాత జిల్లాలో చక్కని అభివృద్ధి కొనసాగింది. బెంగాలీ, తెలుగు, మరాఠీ, బీహారీ, ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. రాయగఢ్, శక్తి, సారంగర్, ఉదయపూర్, జోష్ పూర్ రాజాస్థానాలు ఒకటిగా కలవడం వలన ఈ జిల్లా ఆవిర్భవించింది.[1] ప్రస్తుతం ఈ జోష్పూర్ ప్రత్యేక జిల్లాగా ఉంది. శక్తి ప్రస్తుతం రాయగఢ్ జిల్లాలో భాగంగా లేదు. చత్తిస్‌గఢ్‌లో రాయగఢ్ జిల్లా పారిశ్రామికంగా శరవేగంతో ముందుకు పోతుంది. భారతదేశంలో పురాతనమైన జనపనార మిల్లు ఇక్కడ ఉంది. భారతదేశంలోని అధికంగా స్టీలు ఉతపత్తి చేస్తున్న పరిశ్రమలు ఈ జిల్లాలలో ఉన్నాయి. జిల్లాలో జె.ఎస్.పి.ఎల్, ఎం.ఎస్.పి, మొనెట్ స్టీల్, ఇతర స్టీలు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి.రాయగఢ్ పరిశ్రమలు ఒకరోజుకు 20,000 టన్నుల బొగ్గును ఉతత్తి చేస్తుంది.

రాయగఢ్ జిల్లా
రాయ్‌గఢ్ సమీపంలో ఉన్న కేలో నది
రాయ్‌గఢ్ సమీపంలో ఉన్న కేలో నది
Location of రాయగఢ్ జిల్లా
రాయగఢ్ జిల్లా
रायगढ जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో రాయగఢ్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో రాయగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంరాయగఢ్
మండలాలు09
విస్తీర్ణం
 • మొత్తం7,086 కి.మీ2 (2,736 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం14,93,627 (2,011 census)
 • Urban
2,46,281
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.16%(959,866)
 • లింగ నిష్పత్తి993
ప్రధాన రహదార్లుNH-49, NH-153(new numbering after a gazzete notification of March 5, 2010)
సగటు వార్షిక వర్షపాతం1584 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,493,627, [2]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 336వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 211 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.02%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 993:1000, [2]
అక్షరాస్యత శాతం. 73.7%.[2]

భాషలు

మార్చు

జిల్లాలో అసురి (ఇది ఆస్ట్రో ఆసియాటిక్ భాష) ను దాదాపు 17,000 మంది మాట్లాడుతూ ఉన్నారు.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Publication by Gokhale Institute of Politics and Economics - 1973- Issue 61 - Page 346
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  5. M. Paul Lewis, ed. (2009). "Asuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

మార్చు