రాయ్‌బరేలి జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాయ్‌బరేలీ జిల్లా (హిందీ:रायबरेली ज़िला) (ఉర్దు: ائے بریلی ضلع) ఒకటి. రాయ్‌బరేలీ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. రాయ్‌బరేలీ జిల్లా లక్నో డివిజన్లో భాగంగా ఉంది.
రాయ్‌బరేలి జిల్లా
रायबरेली ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | లక్నో |
ముఖ్య పట్టణం | రాయ్‌బరేలీ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | రాయ్‌బరేలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,609 కి.మీ2 (1,780 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,04,004 |
• జనసాంద్రత | 740/కి.మీ2 (1,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70% |
• లింగ నిష్పత్తి | 941 |
ప్రధాన రహదార్లు | NH 24B, NH 231 |
Website | అధికారిక జాలస్థలి |
రాయ్ బరేలీ పట్టణం, మునిసిపాలిటీ. ఇది రాయ్ బరేలీ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం రైల్ కోచ్ పరిశ్రమ కలిగిఉంది. షాజహాన్ సమయంలో నిర్మించిన అనేక పురాతన మసీదులు ఉన్నాయి.
భౌగోళికం
మార్చుజిల్లా వైశాల్యం 4,609 చ.కి.మీ. గౌగోళికంగా జిల్లా భూభాగం ఎగుడుదిగుడుగా ఉంటుంది. జిల్లాలో గంగా, సాయి నదులు ప్రవహిస్తున్నాయి. నదీప్రవాహాలు పడవప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. జిల్లాలో ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, గోధుమలు, బార్లీ, సజ్జలు, గసాలు పండించబడుతున్నాయి. జిల్లాను ఓధ్- రోహిల్‌ఖండ్ రైలు మార్గం లక్నోతో అనుసంధానం చేస్తుంది.ఈ మార్గం 1898లో వారణాసి వరకు పొడిగించబడింది.
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయ్‌బరేలీ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,404,004,[2] |
ఇది దాదాపు. | పనామా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 97 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 739 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.51%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 941:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 69.04%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
మార్చుజిల్లాలో హిందీ వ్యవహార భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. ఇది అవధి భూభాగంలో 38 మిలియన్ ప్రజలకు వాడుకలో ఉంది. .[5]
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Panama 3,460,462 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
- ↑ M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.