రాయ్‌సేన్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

రాయ్‌సేన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్‌సేన్ జిల్లా లోని పట్టణం. ఇది రాయ్‌సేన్ జిల్లా ముఖ్యపట్టణం. ఒక కొండ పైన ఉన్న భారీ కోటను బట్టి పట్టణానికి ఈ పేరు వచ్చింది. పట్టణం ఈ కొండ పాదాల వద్ద ఉంది. ఈ పేరు బహుశా రాజవాసిని లేదా రాజశయన్ (రాజ నివాసం) ల నుండి రూపాంతరం చెంది ఉండవచ్చు. రాయ్‌సేన్ జిల్లాలో చూడవలసిన ప్రసిద్ధ ప్రదేశాలు రాయ్‌సేన్ కోట, దర్గా, సాంచి స్థూపం . రాయ్‌సేన్ పట్టణం రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 45.5 కి.మీ. దూరంలో ఉంది.

రాయ్‌సేన్
పట్టణం
Raisen fort
Raisen fort
రాయ్‌సేన్ is located in Madhya Pradesh
రాయ్‌సేన్
రాయ్‌సేన్
Coordinates: 23°20′N 77°48′E / 23.33°N 77.8°E / 23.33; 77.8
దేశంభారత దేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లారాయ్‌సేన్
Population
 (2011)
 • Total44,162
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-38

రాయ్‌సేన్ కోట మార్చు

రాయ్‌సేన్ కోట ఒక కొండ శిఖరంపై ఉంది. ఇక్కడి శివాలయం మహాశివరాత్రి వేడుకలకు ప్రసిద్ది చెందింది. పని చేసే స్థితిలో ఉన్న పురాతన ఫిరంగి కూడా కొండపై ఉంది. రంజాన్ మాసంలో సూర్యాస్తమయాన్ని ప్రకటించేందుకు దీన్ని వాడుతారు

జనాభా వివరాలు మార్చు

2001 జనగణన ప్రకారం,[1] రాయ్‌సేన్ జనాభా 35,553. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. రాయ్‌సేన్ అక్షరాస్యత 66%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 72%, స్త్రీల అక్షరాస్యత 59%. జనాభాలో 15% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు మార్చు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.