రాళ్ళబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల, రాజమహేంద్రవరం
వ్యాసంలోని పేరాల్లో "ప్రముఖ", "ప్రసిద్ధ", "ప్రఖ్యాత", "విఖ్యాత" వంటి విశేషణా లున్నాయి. ఈ పదాలను ఉపయోగించినపుడు తగు మూలాలను చేర్చడం చాలా సందర్భాల్లో తప్పనిసరి. వాటికి మూలాలు లేకుంటే తగు మూలాలనిచ్చి, వికీపీడియాను మెరుగుపరచండి. |
రాజమహేంద్రవరం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ది చెంది ఉన్నది. దీని సమీప ప్రాంతాల ద్వారా అశేషమైన చారిత్రక వస్తు సంపద పోగుపడింది. దీని బద్రపరచాలనే మంచి సంకల్పంతో పలువురు ప్రముఖులు కృషి చేసారు. వారి కృషి వలన నగరంలో గోదావరి తీరంలో పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటు జరిగింది.
ప్రారంభం
మార్చుప్రాచీన శిల్పాలు, శాసనాలు, రాగిరేకులు, ఇతర చారిత్రక గ్రంథాలను సేకరించి ప్రామాణికంగా ఆంధ్రదేశ చరిత్రను రాయాలనే ఉద్దేశంతో ఆంధ్రా హిస్టారికల్ సొసైటీ ఏర్పాటైంది. అప్పటి వరకు సేకరించిన చారిత్రక శిల్పాలు, శాసనాలను 1956లో ఒక ప్రదర్శనశాలగా తీర్చిదిద్దింది. రాష్ట్రపురావస్తు ప్రదర్శనశాలలశాఖ ఆప్రదర్శనశాలను స్వాధీనం చేసుకొని 1967లో శ్రీరాళ్ళబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలగా మార్చింది.
ప్రముఖుల కృషి
మార్చురాళ్ళబండి సుబ్బారావు
మార్చువస్తు సంపద
మార్చుచరిత్ర పూర్వయుగం నుంచి మధ్య యుగం వరకూ వాడిన వివిధ పనిముట్లు రాతియుగాల కాలం నాటి గొడ్డళ్లు, చారిత్రిక యుగం నాటి రాతి పాత్రలు, మట్టి పాత్రలు, ఇటుకలు, ఇనుపయుగం నాటి పురాతన వస్తువులు కత్తులు, కటారులు, రాజులకాలం నాటి నాణాలు , ఇక్ష్వాకు, తూర్పు, చాళుక్య రాజులు వ్రాయించిన రాగిరేకు శాసనాలు, కొయ్యబొమ్మలు, రాతి శిల్పాలు, కంచు విగ్రహాలు, బీదరీ పాత్రలు, 11వ శతాబ్దంలో రాజోలు మండలంలోని తాటిపాకలో లభ్యమైన వర్దమాన మహావీరుడి విగ్రహం, ధవళేశ్వరం, వేమగిరి మధ్య త్రవ్వకాలలో లభ్యమైన శైవ పానవట్టం ఒక అద్భుతం అని చెప్పాలి, పాన పట్టం పై ఉన్న శివుడికి అభిషేకం చేస్తే, అభిషేకం చేరిన నీరు లేదా పాలు నందినోట్లో నుంచి బయటకు వస్తాయి. అలాగే వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం నుంచి సేకరించిన నీటిపై తేలియాడే కాకతీయుల కాలంనాటి ఇటుక, సందర్శకులకు ఆశ్చర్యం కలుగచేస్తాయి, ఇక తూర్పు చాళుక్య రాజైన శ్రీ రాజరాజ నరేంద్రుని పేరుతో శ్రీరాజరాజ అని ముద్రించిన బంగారు నాణెం, 1975లో గోదావరి వరదలలో కొట్టుకుని వచ్చిన గిరిజన దేవత కొయ్య బొమ్మ, అలాగే మధ్యయుగానికి చెందిన స్కంధ మూర్తి, విష్ణు, శ్రీదేవి, భూదేవి, హనుమాన్, తార, విగ్రహాలు, గోల్కొండ నవాబులు కుతుబ్ షాహీల ఆయుధాలు, 3వశతాబ్దం నాటి సున్నపురాతితో చేసిన బుద్ధుని విగ్రహం, రాజమండ్రి చంద్రిక థియేటర్ తవ్వకాలలో లభ్యమైన పెద్ద నంది బొమ్మ తాటిపాకలో లభ్యమైన జైన తీర్ధంకరుడైన వర్ధమానమహావీరుడు, వేణుగోపాల .కుమార స్వామి, సూర్య, భైరవ, గణేశ, నంది.మకర తోరణం, ద్వారపాలక, ఆంజనేయ, శ్రీదేవి, పార్వతి శిల్పాలు గోదావరి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి ఈ ప్రదర్శన శాలలో ఉన్న పురాతన వస్తువులను చుస్తే వాటిని సేకరించడానికి రాళ్ళబండి సుబ్బారావు గారు పడిన శ్రమ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారి పేరుమీదనే 1967 వ సంవత్సరంలో శ్రీ రాళ్లబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల, రాజమండ్రిగా ఆ మ్యూజియం కి నామకరణం చేయడం జరిగింది