రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు

ఈ పాట సీతారాముల కళ్యాణం (1989) సినిమా లోనిది. ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించగా, నందమూరి బాలకృష్ణ, రజిని, జగ్గయ్య గారు నటించారు. ముఖ్యంగా ఈ పాటకు ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యాన్ని అందించగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించారు.

పల్లవి:

లా లా లలలాల... లలలా..లలలలలా....

లా లా లా లలలాల ...లాలలాలలా.....

ఊహుహు..ఆహాహా..ఓహోహో...

లాలాలా ఆహాహా ఓహోహో...

అతడు:

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు ....

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో

ఒక్కసారి..కలలోన్ తీయగా గురుతు తెచ్చుకో|||


ఆమె:


రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు ....

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో

ఒక్కసారి..కలలోన్ తీయగా గురుతు తెచ్చుకో|||

చరణం:1


అతడు:

కలలన్నీ పంటలై పండెనేమో?? కలిసింది కన్నుల పండగేమో??

ఆమె:

చిననాటి స్నేహమే అందమేమో.. అది నేటి అనురాగ బంధమేమో!!

అతడు

తొలకరి వలపులలో... పులకించు హృదయాలలో ...

తొలకరి వలపులలో... పులకించు హృదయాలలో ...

ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు??

ఆమె:

ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో

ఎన్నెన్ని భావాలో??

అతడు:

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు ....

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో

ఆమె:

ఒక్కసారి..కలలోన్ తీయగా గురుతు తెచ్చుకో|||

చరణం:2


అతడు:

చూశాను ఎన్నడో పరికిణిలో...వచ్చాయి కొత్తగా సొగసులేవో....

ఆమె:

హృదయాన దాచిన పొంగులేవో...పరువాన పూచెను వన్నెలేవో!!

అతడు:

వన్నెల వానల్లో...వనరైన జలకాలలో

వన్నెల వానల్లో...వనరైన జలకాలలో

మునగాలి తేలాలి తడవాలి ఆఆరాలి మోహంలో!!

ఆమె:

ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో

ఎన్నెన్ని కౌగిళ్ళో??


రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు ....

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో

ఒక్కసారి..కలలోన్ తీయగా గురుతు తెచ్చుకో|||

లా లా లలలాల... లలలా..లలలలలా....

లా లా లా లలలాల ...లాలలాలలా.....