రావన్ అండ్ ఎడ్డి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
రావన్ అండ్ ఎడ్డి, ప్రముఖ రచయిత, కిరణ్ నగార్కర్ రచించిన హాస్య నవల. ఈ పుస్తకములో రచయిత తన రాష్ట్రమైన మహారాష్ట్ర యొక్క జీవిత విధానాన్ని చాల చక్కగా పొందుపరిచారు. ఈ నవల, భారత దేశనికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి కాలాన్ని, అనగా 1950 కాలం నాటి భారత దేశ పరిస్థితులను సూచిస్తుంది. హైందవులు, క్రైస్తవులు, స్వాతంత్ర్యం వచ్చిన నాటి కాలంలో వారి జీవన విధానం ఈ నవలలో మనకు కనబదుతుంది.
రచయిత(లు) | కిరణ్ నగార్కర్ |
---|---|
దేశం | భారత దేశం |
భాష | ఆంగ్లము |
శైలి | హాస్యం |
ప్రచురణ సంస్థ | 1995 |
ప్రచురణ కర్త | పెంగ్విన్ బుక్స్ ఇండియా, హార్పెర్ కోలిన్స్ పబ్లిషర్స్ |
పుటలు | 323 |
ISBN | 978-935029-325-6 |
సారాంశం
మార్చుఇది ఒక ఇద్దరబ్బాయిల కథ.అది 1950 నాటి కాలము. భారత దేశానికి అప్పుడె స్వాతంత్ర్యం వచ్చిన రోజులు.గోవా ఇంకా పోర్త్చుగల్ పాలనలో ఉంది.మతపరమైన, కులపరమైన భేదాలు చావల్లో (మహారాష్ట్ర) నివసించే ప్రజలకు సర్వసాధారణం. హైందవులు క్రైస్తవులతో, క్రైస్తవులు హైందవులతో మాట్లాడేవారు కారు.భాష వారికి అడ్డుగా నిలిచింది. రావన్, ఎడ్డీల కథ ఒక చిన్న సన్నివేశముతో ప్రారంభమవుతుంది. ఎడ్డి ఇంకా పుట్టలేదు. రావన్ అప్పటికే నెలల బాబు. రావన్ హైందవ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఎడ్డి క్రైస్తవ కుటుంబానికి చెందిన అబ్బాయి.వీరు ముంబాయి మజాగోన్ ప్రాంతములో నివసిస్తూ ఉండేవారు.ఎడ్డి తండ్రి విక్టర్, రావన్ తల్లి పార్వతి భాయిని గాఢంగ ప్రేమిస్తున్నాడు.కాని ఆ విషయం ఆమెతో చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు.నాలుగవ అంథస్థులో, ఆరుబయట ఒకరోజు పార్వతి బట్టలు ఆరవేస్తుండగా, ఆమెను గాఢంగ ప్రెమిస్థున్న విక్టర్ ఆమెవైపే చూస్తూ అలానే నిలచిపోయాడు. ఆమె దృష్టిని తనవైపు మరల్చుకోడానికి బదలుగ రావన్ తనను చూస్తూ హటాత్తుగ క్రింద పడుతువుండగా, విక్టర్ ఆ బాబుని కాపాడే ప్రయత్నములో తను కూడా మెడ మీది నుండి పడడం జరుగుతుంది. రావన్ని కాపదు