రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ

రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ) - ఇది 1922 మార్చి 13న అప్పటి బ్రిటిష్‌ - ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌లోని డూన్ వ్యాలీలో ఉంది. భారతీయ యువతకు ఈ కాలేజీలో మిలిటరీ శిక్షణ ఇచ్చి ఆ తర్వాత బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో చేర్చుకునేవారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఎన్‌డీయే (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ), నావెల్‌ అకాడమీలో చేరుతుంటారు. ఆర్‌ఐఎంసీ కమాండెంట్‌ కల్నల్‌ అజయ్‌ కుమార్‌.

రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ
స్థానం
డూన్ వ్యాలీ, డెహ్రాడూన్‌, ఉత్తరాఖండ్‌

సమాచారం
రకంసైనిక కళాశాల
స్థాపన1922
స్థాపకులుప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎడ్వర్డ్ VIII యునైటెడ్ కింగ్‌డమ్
తరగతులుతరగతులు 8–12
Genderబాలబాలికలు
వయస్సు11.5 సంవత్సరాలు to 13 సంవత్సరాలు
విద్యార్ధుల సంఖ్య250 మంది క్యాడెట్లు
Campus size138-ఎకరం (0.56 కి.మీ2)
Colour(s)లేత నీలం, ముదురు నీలం   
పూర్వ విద్యార్థులురిమ్కోలియన్స్
విభాగాలుప్రతాప్, రంజిత్, శివాజీ , చంద్రగుప్త
Websitehttp://www.rimc.gov.in
RIMC లో పండిట్ నెహ్రూ

ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. ఈ మిలిటరీ స్కూల్‌ను ప్రారంభించినప్పటి నుంచి అబ్బాయిలనే చేర్చుకుంటున్నారు. కానీ ఇటీవల 2022 మార్చి 13న ఈ స్కూల్‌ శత వసంత వేడుకల సందర్భంగా ఈ మిలిటరీ స్కూల్‌ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్‌లో తొలిసారిగా అమ్మాయిలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది.[1]

మూలాలు

మార్చు
  1. "RIMC: వందేళ్ల తర్వాత ఆ పాఠశాలలో బాలికలకు ప్రవేశం." EENADU. Retrieved 2022-03-14.