రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్

మన్మోహన్ సబిర్ దర్శకత్వంలో 1960లో విడుదలైన హిందీ చలనచిత్రం.

రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్ 1960లో విడుదలైన హిందీ చలనచిత్రం. మన్మోహన్ సబిర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, షీలా రమణి, నాజీ, షమ్మీ, మజ్ను, హెలెన్, డేవిడ్ నటించగా అనిల్ బిస్వాస్ సంగీతం అందించాడు.

రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్
దర్శకత్వంమన్మోహన్ సబిర్
నిర్మాతమన్మోహన్ సబిర్
తారాగణంపైడి జైరాజ్, షీలా రమణి, నాజీ, షమ్మీ, మజ్ను, హెలెన్, డేవిడ్
సంగీతంఅనిల్ బిస్వాస్
పంపిణీదార్లుమన్మోహన్ ఫిల్మ్
విడుదల తేదీ
1960
దేశంభారతదేశం
భాషహిందీ

కథానేపథ్యం

మార్చు

వింత విమాన శిధిలాలలో దొరికిన పిల్లవాడిని ఒక రైతు దంపతులు తమ సొంతబిడ్డా పెంచుతుంటారు. పెద్దవాడై వార్తాపత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అతను, స్మగ్లర్లు నేరంచేసినపుడు సూపర్ హీరోగా మారి వారిని అంతమొందిస్తుంటాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత, దర్శకత్వం: మన్మోహన్ సబిర్
  • సంగీతం: అనిల్ బిస్వాస్
  • పంపిణీదారు: మన్మోహన్ ఫిల్మ్

ఇతర వివరాలు

మార్చు

సూపర్ మేన్ కథ ఆధారంగా 1960లో మన్మోహన్ సబిర్ దర్శకత్వంలో రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్, మహ్మద్ హుస్సేన్ దర్శకత్వంలో సూపర్ మేన్ అనే రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో పైడి జైరాజే సూపర్ మేన్ గా నటించాడు. రెండు సినిమాల పేరు సూపర్ మేన్ అని ఉండగా, మన్మోహన్ సబిర్ తన సినిమా పేరును మార్చుకున్నాడు. సినిమా పేరు ఒకేవిధంగా, ప్రధాన నటుడు ఒకడే ఉన్నప్పటికీ రెండు సినిమాలక సినిమాలకు సంబంధం లేకుండా రూపొందించబడ్డాయి.[3]

పాటలు

మార్చు
  1. "దేఖ్ ఓ బాబు దేఖ్ దిల్ కి దుకాణ్" - మీనా కపూర్
  2. "దిల్ హమ్ కో దూందట హై" - మీనా కపూర్, సుమన్ కళ్యాణ్‌పూర్
  3. "దిల్ మిలాతే జాయియే నజరేన్ మిలాతే జాయియే" - మీనా కపూర్
  4. "ఏక్ తో హూన్ మేన్ హసీన్ బాబు" - మీనా కపూర్
  5. "కిసీకోం యూన్ తుమ్నాఓన్ మేన్" - మీనా కపూర్
  6. "ముహబత్ కిస్ కో కెహ్తే హైన్" - ముబారక్ బేగం
  7. "స్టెల్లా ఓ స్టెల్లా తేరా జానీ తా అబ్ తక్ అకేలా" - మీనా కపూర్, మహేంద్ర కపూర్
  8. "తు హసీన్ హై తు జవాన్ హై" -

మూలాలు

మార్చు
  1. జనంసాక్షి, కవర్ స్టోరి (23 October 2013). "బాలీవుడ్‌లో కరీంనగర్‌ తేజం.. పైడి జైరాజ్‌". janamsakshi.org. Archived from the original on 27 అక్టోబరు 2013. Retrieved 28 September 2019.
  2. నవతెలంగాణ, నవచిత్రం (17 July 2015). "అలనాటి బాలీవుడ్‌ నటి షీలా రమణి కన్నుమూత". NavaTelangana. Archived from the original on 21 జూలై 2015. Retrieved 28 September 2019.
  3. TODD (19 September 2008). "Return of Mr. Superman (india, 1960)". diedangerdiediekill.blogspot.com. Retrieved 19 November 2019.

ఇతర లంకెలు

మార్చు