రిద్ధి షా

(రిద్ధి షాహ్ నుండి దారిమార్పు చెందింది)

రిద్ధి షా గుజరాత్ రాజధాని అహమ్మదాబాదు పాతనగరంలో జన్మించింది. ఆమె " సి.కె బాలమందిర్ " ఆరంభకాల విద్య పూర్తిచేసింది. ఆమె తండ్రి సివిల్ ఇంజనీర్. ఆయన కాలేజి చదివే సమయంలో 15 మైళ్ళదూరంలో ఉన్న కాలేజికి సైకిలు తొక్కుతూ వెళ్ళేవాడు. ఆయన విద్యుద్దీపాల కాంతిలో వీధిలో కూర్చుని చదువుకున్నాడు. ఆయన గణితంలో దిట్ట. రిద్ధి షా తనతణ్డ్రిని మార్గదర్శిగా ఎంచుకున్నది. ఆయన రిద్ధి షాను ఇంజనీరును చేయాలని అనుకున్నాడు. రిద్ధి షా తల్లి గృహిణి. ఆమె రిద్ధి షా గణితంలో పరిశోధన చేయాలని కోరుకున్నది.

రిద్ధి షా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

స్కూలు

మార్చు

ఆరంభంలో ఆమె ఉత్సాహంగా స్కూలుకు వెళ్ళినప్పటికీ తరువాత ఆమెకు స్కూలంటే అయిష్టం ఏర్పడింది. ఒకరోజు ఆమె స్కూలుకు వెళ్ళగానే ఆమె టీచర్ ఆమె కొరకు ఎదురుచూస్తూ ఉంది. కారణం ఆమె మాథ్స్ సబ్జెక్టులో ఉన్నతస్థాయిలో ఉత్తీర్ణత సాధించడం. తరువాత రిద్ధి షా స్కూలుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపింది.

తల్లి ప్రోత్సాహం

మార్చు

రిద్ధి షా తల్లి తన పిల్లలను (ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు) చక్కగా చదువుకోవాలని ప్రోత్సహించేది. ఆమె కనీసం రెండు డిగ్రీలైనా పుచ్చుకోవాలని చెప్పింది. ప్రతిరోజు ఆడుకుని ఇంటికి రాగానే ఆమె చదవడానికి కూర్చోపెట్టేది. ఆమె ఆర్థికపరిస్థితుల కారణంగా మెట్రిక్యులేషన్‌తో చదువు ముగించింది. వారి ఇంటికి ఎదురుగా గ్రంథాలయం ఉండేది. ఆమె తల్లి అధికంగా గుజరాతీ సాహిత్యాన్ని చదివుతూ ఇతరులను కూడా పుస్తకాలు చదవమని ప్రోత్సహించేది. ఆమె పిల్లలను దూరమైనా సరే మంచి ఉన్నత పాఠశాలలో చేరమని ప్రోత్సహించింది. రిద్ధి షా ప్రభుత్వ బసులో ప్రయాణించి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. ఆమె అమ్మమ్మ, అక్కచెల్లెళ్ళు, సోదరుడు ఆమెకు తమ పూర్తి సహకారం అందించారు.

ఉన్నత పాఠశాల

మార్చు

రిద్ధి షా జి.ఎం. ప్రకాష్ ఉన్నత పాఠశాలలో చదివే సమయంలోనే గణితం అంటే మక్కువ పెంచుకున్నది. ఆమెకు నంబర్లను ప్రేమించింది. ఆమె ప్రింసిపల్ కుసుం బెన్ షా ఆమె ప్రఙాను గుర్తించి ఆమెను అప్పటి గుజరాత్ యుఇనివర్శిటీ వైస్ చాంసలర్ అయిన పి.సి. వైద్యా వద్దకు పంపింది. ఆమె రిద్దీ షా ఈక్వేషన్లను పరిశీలించి వాటిని వివరించమని అడిగింది. కొంతసేపు సన్శయించినా తరువాత చాక్‌పీస్ తీసుకుని బ్లాక్‌బోర్డ్ వద్దకు పోయి వివరణ ఇచ్చి ఆమెను తృప్తి పరిచింది. ఆతరువాత ఆమె మాథమెటిక్స్ ప్రధానాంశంగా పైచదులు చదవాలని నిశ్చయించుకున్నది. అప్పటి వరకు ఆమెకు రీసెర్చ్ అంటే ఏమిటో అవగాహన లేదు.

కాలేజ్

మార్చు

రిద్ధి షా " క్సేవియర్ కాలేజ్ "లో చదివే సమయంలో ఆమెకు చాలా మంచి ఉపాధ్యాయులు లభించారు. ఆమె అండర్ గ్రాజ్యుయేషన్ ముగించే వరకు శాంతి ప్రసన్న ఆమెకు ప్రేరణ, ప్రోత్సాహం అందించింది. ఆమె రిద్ధి షా మేధస్సును గుర్తించి అమెను తనకుమార్తెలా భావిస్తూ ప్రోత్సహించుందు. వారి అనుబంధం తరువాతి కాలమంతా కొనసాగింది.ఆమె మేధస్సును గుర్తించిన ఎస్.ఎస్. వోరా ఆమెను " బాంబే ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "లో చేరమని సలహా ఇచ్చాడు.

రీసెర్చ్

మార్చు

అరోజులలో రిద్ధి షా కుటుంబంలో ఆడపిల్లలను పైచదువుల కొరకు ఊరు విడిచి వెలుపలకు పంపే అలవాటు లేనప్పటికీ రిద్ధి షా తాల్లితండులు ఆమెను ప్రోత్సహిస్తూ " బాంబే ఐ.ఐ.టి "కి అభ్యర్థించమని చెప్పారు. ఐ.ఐ.టిలో ఆమె గైడ్ డి.వి.పాల్ సహాయంతో రీసెర్చ్ చేసే సమయంలో మొదటిసారిగా ఆమెకు రీసెర్చ్ అంటే ఏమిటో తెలిసి వచ్చింది. " బాంబే ఐ.ఐ.టి "లో ఎం.ఎస్.సి పూర్తిచేసిన తరువాత 1986 ఆమె " టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్" ఫెలో షిప్పు అందుకున్నది.

వివాహం

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.


"https://te.wikipedia.org/w/index.php?title=రిద్ధి_షా&oldid=3858043" నుండి వెలికితీశారు