రిపబ్లిక్ స్క్వేర్, యెరవాన్

రిపబ్లిక్ స్క్వేర్ (ఆర్మేనియన్:Հանրապետության հրապարակ)[5][6]ఆర్మేనియా దేశపు రాజధాని అయిన యెరెవాన్ నగరంలోని ఒక ప్రధాన కూడలి. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి: ఒక ఓవల్ రౌండ్అబౌట్, ఒక ఫేపెజాయిడ్-ఆకారపు విభాగం, ఇది సంగీత ఫౌంటైన్ల పూల్ని కలిగి ఉంటుంది. ఈ స్క్వేర్ చుట్టూ పింక్, పసుపు టఫ్ లో నిర్మించిన ఐదు ప్రధాన భవనాలు నియోక్లాసికల్ శైలిలో ఆర్మేనియన్ మూలాంశాలను విస్తృతంగా గుర్తుచేస్తాయి[7][8] ఈ నిర్మాణ సమ్మేళనంలో ప్రభుత్వ గృహం, చరిత్ర సంగ్రహాలయం, నేషనల్ గ్యాలరీ, ఆర్మేనియా మారియట్ హోటల్, విదేశీ వ్యవహారాల శాఖ, రవాణా శాఖ, సమాచార మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఈ స్క్వేర్ నిజానికి అలెగ్జాండర్ టమానియన్ చేత 1924 లో రూపొందించబడింది.[9] అనేక భవనాల నిర్మాణాన్ని 1950 నాటికి పూర్తి చేశారు; చివరి భవనం నేషనల్ గేలరీ -1977 లో పూర్తయింది.[2]

రిపబ్లిక్ స్క్వేర్
The History Museum and the National Gallery (left) and the Government House (right) in Republic Square as seen at night, 2013
పూర్వపు పేర్లులెనిన్ స్క్వేర్ (1940–1990)[1]
నిర్వహించువారుయెరెవాన్ మ్యునిసిపాలిటీ
విస్తీర్ణం3 హెక్టారులు (30,000 మీ2)[1]
ప్రదేశంకెంట్రాన్ జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా
సమీప మెట్రో స్టేషన్రిపబ్లిక్ స్క్వేర్ మెట్రో
నిర్మాణం
నిర్మాణ ప్రారంభం1926[2][3][4]
పూర్తిచేయబడినది1977[2]
ఇతరములు
రూపకర్తఅలెక్జాండర్ తమానియన్

సోవియట్ కాలంలో దీనిని లెనిన్ స్క్వేర్ అని పిలిచారు, వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని ఈ స్క్వేర్ ను ఉంచారు, ఇక్కడ ఒక సంవత్సరంలోనే సైనిక దండయాత్రలు రెండుసార్లు (నిజానికి మూడుసార్లు) జరిగాయి. అర్మేనియా స్వాతంత్ర్యం తరువాత లెనిన్ విగ్రహాన్ని తీసివేయడంతో స్క్వేర్ పేరు మార్చబడింది. అర్మేనియా స్వాతంత్ర్యం తరువాత లెనిన్ విగ్రహాన్ని తీసివేయడంతో స్క్వేర్ పేరు మార్చబడింది. ఇది యెరెవాన్ లోని "ఆకర్షణీయమైన నిర్మాణం", నగరం యొక్క "అత్యద్భుతమైన శిల్ప శైలి" గా వర్ణించబడింది.[10] ప్రయాణాల రచయిత డీర్డ్రే హోల్డింగ్ "ఇది ఖచ్చితంగా 20 వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కడా సృష్టించబడని అత్యుత్తమ సెంట్రల్ స్క్వేర్స్ లో ఒకటి" అని సూచించారు. అర్మేనియా నగరం యొక్క "అత్యంత ముఖ్యమైన పౌర ప్రదేశం" గా దీనిని పేర్కొంటారు, రిపబ్లిక్ స్క్వేర్ 2018 వెల్వెట్ విప్లవం సమయంలో ప్రదర్శనలు ప్రధాన ప్రదేశం.

ఆర్కిటెక్చర్

మార్చు

ఈ స్క్వేర్లో రెండు విభాగాలు ఉన్నాయి. మధ్యలో ఒక రాయి నమూనా ఉన్న ఓవల్ రౌండ్అబౌట్, పైవైపు నుండి ఒక సాంప్రదాయిక ఆర్మేనియన్ రగ్గ లాగా ఉంటుంది. చరిత్ర సంగ్రహాలయం, నేషనల్ గ్యాలరీ ముందు సంగీత ఫౌంటెన్ కలిగి ఉన్న ట్రెపజాయిడ్-ఆకారపు విభాగం.[11] చతురస్రాకారంలో ఉన్న భవనాలు గులాబీ, పసుపు టఫ్ రాళ్ళతో తయారు చేయబడ్డాయి, ఇవి బసాల్ట్లతో తయారు చేయబడిన గ్రౌండ్ యాంకర్లతో బలపడినవి.

చరిత్ర

మార్చు
 
1916 లో యెరెవాన్ ప్రధాన స్క్వేర్ యొక్క చిత్రం

శతాబ్దాలుగా దీని యొక్క స్థానాంలో భిన్నమైన నిష్పత్తులు కలిగిన స్క్వేర్ ఉన్నది. 2003 లో ఈ స్క్వేర్ పునర్నిర్మించబడింది, ఇక్కడ విస్తృతమైన త్రవ్వకాలు జరిగాయి. 18 వ -19 వ శతాబ్దాల ఇక్కడి పాత పొర-బయటపడింది. సోవియట్ కాలం లోని స్క్వేర్ 1906-11 యెజెన్ యెక్క సాధారణ ప్రణాళికలో బోరిస్ మెహ్రబ్యన్ (మెగ్రాబ్రోవ్) చేత రూపొందించబడింది.

ప్రస్తుతం ఉన్న స్క్వేర్ ను అలెగ్జాండర్ టమేనియన్ తన 1924 యెరెవాన్ సాధారణ ప్రణాళికలో రూపొందించారు.[12] ప్రభుత్వ భవనం ప్రారంభమైనప్పుడు 1926 లో ఈ స్క్వేర్ నిర్మాణం ప్రారంభమైంది. 1950 ల వరకు మిగిలిన ఐదు భవనాలు నిర్మించబడ్డాయి, చివరికి 1977 లో జాతీయ గ్యాలరీని నిర్మించారు. సోవియట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ కోసం లెనిన్ స్క్వేర్ (లెనిని హ్రాప్రాక్) అనే పేరు పెట్టారు, అతని విగ్రహం 1940 లో స్క్వేర్లో నిర్మించబడింది, ఆర్మేనియా స్వాతంత్రానికి ముందు 1991 లో విచ్ఛిన్నం చేయబడింది.[13]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Հանրապետության հրապարակ [Republic Square] (in ఆర్మేనియన్). Հայկական Համառոտ Հանրագիտարան (Concise Armenian Encyclopedia). 1999. p. 296.
  2. 2.0 2.1 2.2 Government of the Republic of Armenia (2 November 2004). "Հայաստանի Հանրապետության Երևան քաղաքի պատմության և մշակույթի անշարժ հուշարձանների պետակական ցուցակ [List of historical and cultural monuments of Yerevan]". arlis.am (in ఆర్మేనియన్). Armenian Legal Information System. Archived from the original on 5 August 2016.
  3. టిగ్రానియన్ 1985, p. 25.
  4. అవెతిస్యాన్ 1979, p. 80.
  5. Pechakjian, Pauline (28 April 2016). "The 10 Best Hotels & Inns in Yerevan, Armenia". theculturetrip.com. ...Republic Square, referred to by locals as the Hraparak...
  6. "De-Sovietized Streets". Armenian International Magazine: 17. September 2001. The street just off Hraparak...
  7. Louis, Victor E.; Louis, Jennifer M. (1987). Louis motorist's guide to the Soviet Union. Pergamon Press. p. 517. ISBN 9780080318172. The centre of Erevan is Lenin Square; it was built as an architectural whole using the Armenian national style of architecture.
  8. Gregorian, Vartan (2008). The Road to Home: My Life and Times. Simon and Schuster. p. 178. ISBN 9781439129111. Buildings around the square were designed to reflect some features of ancient Armenian architecture.
  9. "Government Building History". Government of the Republic of Armenia. Archived from the original on 4 August 2016.
  10. "Լենինի արձան` (ան)կենդանի պատմություն". mediamax.am (in ఆర్మేనియన్). 27 November 2012. Archived from the original on 4 August 2016.
  11. "Հրապարակի շատրվաններն ու ցայտաղբյուրը` կենդանի պատմություն". mediamax.am (in ఆర్మేనియన్). Mediamax. 3 April 2013.
  12. Gevorgian, A. O. (1979). "Yerevan". The Great Soviet Encyclopedia. The main architectural ensemble of the city is Lenin Square, at which several streets converge. On the square are a monument to V. I. Lenin (cast bronze, 1940, sculptor S. D. Merkurov), the Government House of the Armenian SSR (1926-41, A. I. and G. A. Tamanian), the second Government House (1955, S. A. Safarian, V. A. Arevshatian, and R. S. Israelian), the Armenian Historical Museum (1975), the Hotel Armenia (1958), and the building of the Communications Ministry and the Trade Union Council (1956-58); the last three were designed by M. V. Grigorian and E. A. Sarapian. view article online
  13. "Շրջայց Երևանով. Հանրապետության հրապարակ [Yerevan Walking Tour: Republic Square]". armenianheritage.org (in ఆర్మేనియన్). Armenian Monuments Awareness Project. Archived from the original on 2019-04-07. Retrieved 2018-06-30.

గ్రంథసూచి

మార్చు

బయటి లింకులు

మార్చు


40°10′40″N 44°30′46″E / 40.17778°N 44.51278°E / 40.17778; 44.51278