రీటా భాదురి (బెంగాలీ:রীতা ভাদুড়ি}}, హిందీ: रीटा भादुड़ी) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.[1] ఈమె 1970 - 90 లలో పలు బాలీవుడ్ సినిమాలలో సహాయనటిగా తన నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె "సావన్ కో ఆనే దో" (1979), "రాజా" (1995) వంటి సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమాలలో ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఈమె పేరు ప్రతిపాదించబడింది.[2] 1975లో హిట్టయిన హిందీ సినిమా జూలీలో ఈమె జూలీ స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాలో "యే రాతే నయీ పురానీ" అనే పాట ఈమెపై చిత్రీకరించబడింది.

రీటా భాదురి
রীতা ভাদুড়ি
रीटा भादुड़ी
2012లో రీటా భాదురి
జననం(1955-11-04)1955 నవంబరు 4
మరణం2018 జూలై 17(2018-07-17) (వయసు 62)
వృత్తిహిందీ చలనచిత్ర నటి, టెలివిజన్ నటి
క్రియాశీల సంవత్సరాలు1968–2018

ఈమె 1973లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది. ఈమెతో పాటుగ శిక్షణ పొందినవారిలో జరీనా వహాబ్ కూడా ఉంది.[3] ఈమె "నిమ్కి ముఖియా" సీరియల్‌లో అవ్వ వేషం వేసింది.[4] ఈమె తన 62వ యేట ముంబయిలో మూత్రపిండాల వ్యాధికి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.[5]

ఫిల్మోగ్రఫీ

మార్చు

రీటా భాదురికి గుజరాతీ భాషతో సంబంధం లేక పోయినా ఈమె గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటిగా రాణించింది.

సినిమాలు

మార్చు

ఈమె 71 సినిమాలలో నటించింది.

  • 2012 కెవి రితె జైష్ (ముసలావిడ)
  • 2003 మై మాధురీ దీక్షిత్ బన్‌నా చాహ్తీ హూఁ (కళావతి)
  • 2002 దిల్ విల్ ప్యార్ వ్యార్
  • 2002 ములాఖాత్ (మిసెస్ పట్కర్)
  • 2000 క్యా కెహనా (అజయ్ తల్లి)
  • 1999 హోతే హోతే ప్యార్ హో గయా (ఆశా)
  • 1998 జానే జిగర్ (మిసెస్ ప్రేమ్‌ కిషన్)
  • 1997 తమన్నా (మదర్ సుపీరియర్)
  • 1997 హీరో నెం.1 (మిసెస్ లక్ష్మీ వైద్యనాథ్)
  • 1997 విరాసత్ (మౌసీ)
  • 1996 ఖూన్ కి ప్యాసీ (పార్వతి)
  • 1995 ఆతంక్ హీ ఆతంక్ (మిసెస్ శివచరణ్ శర్మ)
  • 1995 డాన్స్ పార్టీ (మిసెస్ లజ్జో శర్మ)
  • 1995 ఇంతెఖాం కె షోలే
  • 1995 మా కీ మమత (శాంతి)
  • 1995 రాజా (సరితా గరేవాల్)
  • 1994 స్టంట్‌మాన్ (రీనా తల్లి)
  • 1993 దలాల్ (మిసెస్ జూన్-జున్ వాలా)
  • 1993 రంగ్ (మిసెస్ జోషి)
  • 1993 గేమ్ (విక్రం తల్లి)
  • 1993 ఆషిక్ ఆవారా (గాయత్రి)
  • 1993 ఇన్సానియత్ కే దేవత (సుమిత్రాదేవి, రంజిత్ భార్య)
  • 1993 అంత్ (ప్రియ తల్లి)
  • 1993 కభీ హా కభీ నా (మేరి)
  • 1992 యుధ్‌పథ్ (మిసెస్ చౌదరి)
  • 1992 తిలక్
  • 1992 అజీబ్ దస్తాన్ హై యే (స్కూల్ టీచర్)
  • 1992 బేటా (నీతా)
  • 1991 లవ్ (స్టెల్లా పింటో)
  • 1991 హౌస్ నెం.13 (శాంతి)
  • 1991 ఖూని పంజా
  • 1991 ఆయీ మిలన్ కి రాత్
  • 1990 తేరీ తలాష్ మే (శాంత డి.సంధు)
  • 1990 ఘర్ తో ఐసా (కంచన్)
  • 1990 జంగిల్ లవ్ (రాణి తల్లి)
  • 1990 నెహ్రూ: ది జువెల్ ఆఫ్ ఇండియా
  • 1990 నయా ఖూన్ (సప్న శ్రీవాత్సవ్)
  • 1989 సిందూర్ ఔర్ బందూక్
  • 1988 రామా ఓ రామా (మోను తల్లి)
  • 1988 ఘర్ మే రామ్‌ గలీ మే శ్యామ్‌ (మిసెస్ ధరంచంద్)
  • 1987 దిల్‌జలా (మరణించిన శిశువు తల్లి)
  • 1986 మై బలవాన్ (గీత, టోనీ తల్లి)
  • 1985 ఫూలన్ దేవి (ఫూలన్)
  • 1984 మాయాబజార్ (సురేఖ)
  • 1983 నాస్తిక్ (శాంతి)
  • 1982 బే జుబాన్ (రేవతి/మీరాబాయి)
  • 1982 చల్తీ కా నామ్‌ జిందగీ
  • 1981 వో ఫిర్ నహీ ఆయె (రీటా బాధురి)
  • 1981 జగ్య త్యాథి సవార్
  • 1981 గర్వి నార్ గుజరాతన్
  • 1980 గెహ్రాయీ (చెన్ని)
  • 1980 ఉన్నీస్-బీస్
  • 1980 హమ్‌ నహీ సుధెరెంగె
  • 1980 ఖంజర్
  • 1979 రాధ ఔర్ సీత (రాధ ఎస్.సక్సేనా)
  • 1979 గోపాల్ కృష్ణ (యశోద)
  • 1979 నాగిన్ ఔర్ సుహాగన్ (గౌరి జె.సింగ్/కమల)
  • 1979 సావన్ కో ఆనే దో (గీతాంజలి)
  • 1979 కాషినొ డిక్రో (రమ)
  • 1978 కాలేజ్ గర్ల్
  • 1978 విశ్వనాథ్ (మున్నీ)
  • 1978 ఖూన్ కి పుకార్ (రాణి)
  • 1977 అయినా (పూర్ణ ఆర్.శాస్త్రి)
  • 1977 దిన్ అమదర్
  • 1977 కుల్‌వధు
  • 1977 అనురోధ్ (అంజు)
  • 1976 ఉధార్ కా సిందూర్ (సుధ - ప్రేమనాథ్ సోదరి)
  • 1975 జూలీ (ఉషా భట్టాచార్య)
  • 1974 కన్యాకుమారి
  • 1968 తేరీ తలాష్ మే

టెలివిజన్

మార్చు
పేరు పాత్ర ఛానల్
బన్తే బిగాడ్తే దులారీ దూరదర్శన్
మంజిల్ మౌసీ దూరదర్శన్
నిమ్కి ముఖియా దాది స్టార్ భారత్
కాజల్ బిమ్మో బువా సోని టివి
సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ ఇలా బెన్ మధుసూదన్ స్టార్ వన్
కోయీ దిల్ మే హై ఆశా తల్లి సోని టివి
జమీన్ ఆస్మాన్ షన్నో
గిరిజా దేవి ఇల్లాలు జీ టివి
హద్ కర్ ది కిరణ్/బీజి జీ టివి
సాస్ వర్సెస్ బహు రీటా బాధురి సహారా వన్
హమ్‌ సబ్ బరాతి జీ టివి
ఏక్ మహల్ హో సప్నో కా ఫయిబా సోని టివి
థోడా హై థోడేకి జరూరత్ హై సోని టివి
అమానత్ గాయత్రి కపూర్ జీ టివి
గృహలక్ష్మి కా జిన్ గృహలక్ష్మి జీ టివి (1994–97)
గోపాల్‌జీ రుక్మిణి జీ టివి (1996)
ఛోటీ బహూ శాంతిదేవి పురోహిత్ జీ టివి
హస్రతేఁ సావి అత్త జీ టివి
ముజ్రిమ్‌ హాజిర్ దూరదర్శన్
కుంకుం రాజేశ్వరీ వాధ్వా స్టార్ ప్లస్
కిచిడి హేమలత స్టార్ ప్లస్
బైబిల్ కి కహానియా డెబొరా డిడి నేషనల్
భాగోవాలి బన్తే అప్నీ తక్దీర్ అహల్యాదేవి జీ టివి
రిష్తే జీ టివి
కృష్ణబెన్ ఖక్రవాలా సంతు బా సోని టివి
చునౌతి డిడి నేషనల్
మిసెస్ కౌశిక్ కి పాంచ్ బహూయే నాని జీ టివి
బనీ - ఇష్క్ దా కల్మ బిజి కలర్స్, రిస్తే
ఆజ్ కి హౌస్‌వైఫ్ హై... సబ్ జాన్తీ హై సోనా అమ్మమ్మ జీ టివి
ఏక్ నయీ పెహచాన్ దాదీ మా సోని టివి
మోహి వినయ్ తల్లి స్టార్ ప్లస్
జోష్ ఔర్ శక్తి... జీవన్ కే ఖేల్ సుమన్ వాలియా జీ టివి

మూలాలు

మార్చు
  1. "I'm still learning as an actor: Rita Bhaduri".
  2. "Filmfare Nominees and Winners" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2018-07-17.
  3. "First batch looks back at good old days TNN,". The Times of India. 21 March 2010. Archived from the original on 2012-07-14. Retrieved 2018-07-17.
  4. "I play an aggressive beta in my current show shot in Mirzapur: Bareilly actor Jatin Suri".
  5. "Veteran Actress Rita Bhaduri Dies At 62". NDTV. 17 July 2018.

బయటి లింకులు

మార్చు