రుక్మాంగదరెడ్డి

రుక్మాంగదరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన కవి. ఒక వైపు ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే రెడ్డి, మరో వైపు కవిగా తన ప్రతిభను చాటుకున్నారు. 50 సంవత్సరాలు కవిగా, రచయితగా అనేక రచనలు చేసి పాలమూరు సాహిత్యానికి తన వంతు చేయూతనిచ్చారు. 1963 నుండి నేటి వరకు సుమారు 3 వేలకు పైగా పద్యాలు రచించారు. కథలు, నవలలు కూడా రాశారు.[1]. వీరు పాలమురుకు చెందిన మరో ప్రముఖ కవి మల్లేపల్లి శేఖర్ రెడ్డికి మిత్రులు. ఎంతగా అంటే శేఖర్ రెడ్డి తన కుమారుడికి ఇతని పేరే పెట్టుకునేంతగా. శేఖర్ రెడ్డి రాసిన చివరి పుస్తకం రాఘవేంద్ర శతకాన్ని వీరే ముద్రించారు.

రచనలుసవరించు

1. వెలుగుకు ఆహ్వానం 2. శివతత్త్వం 3. ఉరుములు- మెరుపులు 4. రుక్మాంగద రుబాయిలు 5. రుక్మకణికలు 6. ఒకే ఒక్కడు శ్రీశ్రీ 7. సుజన శతకం 8. వివేకానందీయం

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.17.07.2014