రుబాయి (అరబ్బీ: رباعی) ఈపదానికి మూలం అరబ్బీ భాష పదం 'అరబా' అనగా నాలుగు, చతుర్ పంక్తులుగల. రుబాయికి బహువచనం 'రుబాయియాత్' (అరబ్బీ:رباعیات). రుబాయి మూలంగా 'నాలుగు పంక్తులు గల కవిత'. ఈ రుబాయీలు పర్షియన్ భాషలో అధికంగా ప్రసిద్ధిపొందాయి. మౌలానా రూమ్, షేఖ్ సాదీలు కూడా తమ రచనలలో రుబాయీలు రచించారు. రుబాయీలకు ఉమర్ ఖయ్యాం (పర్షియన్), అంజద్ హైదరాబాది, మహమ్మద్ ఇక్బాల్, మీర్ అనీస్, దబీర్, మరియులు ప్రసిధ్ధి.

  • ఉమర్ ఖయ్యాం రుబాయి
  • మహమ్మద్ ఇక్బాల్ రుబాయి


తెరే షీషే మేఁ మై బాఖీ నహీఁ హై
బతా క్యా తూ మేరా సాఖీ నహీఁ హై
సమందర్ సే మిలే ప్యాసే కొ షబ్ నమ్
బఖీలీ హై యె రజ్జాఖీ నహీఁ హై
  • అంజద్ హైదరాబాది రుబాయి
హర్ చీజ్ ముసబ్బబ్ సబబ్ సే మాంగో
మిన్నత్ సే ఖుష్ ఆమద్ సే అదబ్ సే మాంగో
క్యోఁ గైర్ కే ఆగే హాథ్ ఫైలాతే హో
బందే హో అగర్ రబ్ కే తొ రబ్ సే మాంగో
రుబాయి ప్రక్రియ వివరణ:
రుబ్ అంటే ‘రసం, సారం’ అని అర్ధాలు, రుబాయి అంటే రసవంతమైనది అని కూడా అర్ధం. రుబాయి మూలంగా 'నాలుగు పంక్తులు గల కవిత'. ప్రతిపాదం ఒక సంపూర్ణ వాక్యం. ఒకటి, రెండు, నాలుగు, పాదాలకు అంత్యప్రాస నియతి వుంటుంది. మూడోపాదంలో వుండదు. మూడో పాదం - ఒకటి,రెండు,పాదాలను అనుసంధానం చేస్తుంది. మొత్తంగా మూడుపాదాల్లోని అభిప్రాయాన్ని బలపరుస్తూ నాలుగో పాదం చరుపుతో మెరుస్తుంది. గజల్ రుబాయిల్లో అంత్యప్రాసకు పూర్వపదం కూడాప్రాసబద్ధంగా కనిపిస్తుంది. ఈ రెండింటిని ‘ రదీఫ్ కాఫియా’ అంటారు. రుబాయి ఒకే చంధస్సులో ఒకే విషయవిభాగంగా నడుస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=రుబాయి&oldid=3692951" నుండి వెలికితీశారు