రాజనాక రుయ్యకుడు లేదా రుచకుడు పన్నెండవ శతాబ్దం మొదటి అర్ధభాగంలో కాశ్మీర్‌లోని పండిత కుటుంబంలో జన్మించాడు. ఉద్భటుడు కావ్యాలంకార సంగ్రహ నికి వ్యాఖ్యానము రచించిన అలంకారశాస్త్ర పండితుడు అయిన రాజనాక తిలక్,ఇతని తండ్రి. శ్రీకంఠచరితము లో మంఖకుడు తన గురువుగా రుయ్యకుడిగా, పండిత వ్యాఖ్యాతగా, సాహిత్య పండితుడిగా పరిచయం చేశాడు.

ఇతను రచించిన గ్రంథాల సంఖ్య పన్నెండు. సహృదయలీలా, సాహిత్యామీమాంస, కావ్యప్రకాశసంకేత, వ్యక్తివివేకవ్యాఖ్యానము,అలంకార సర్వస్వ ప్రకాశిత గ్రంథములు ముఖ్యమైనవి. నాటక మీమాంస, అలంకారానుసారిణి, అలంకారమంజరి, అలంకారవార్తిక (నాట్యశాస్త్ర, అలంకారశాస్త్ర), శ్రీకంఠస్తవ (కావ్యము), హర్షచరితవార్తిక, బృహతీ (టీకా) వంటి ఇతని రచనలని వివిధ కాశ్మీర కవుల రచనల నుండు తెలియుచున్నవి కానీ ఇవి అందుబాటులో లేవు. రుయ్యకుని యొక్క ప్రధాన ఇతివృత్తం కవిత్వశాస్త్ర విశేషము, అలంకారశాస్త్రము-అని స్పష్టంగా తెలుస్తుంది. ఇతని అలంకార సర్వస్వ, క్రీ. శ. 1135-50 మధ్య రచించబడింది, ఇది భాష యొక్క పరిపక్వత ఇంకా భాషయొక్క వివిధ రీతులను విశేషముగా తెలుపుచున్నది. అందుకే రుయ్యకుడు ప్రఖ్యాత అలంకార పండితుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇది రెండు భాగాలను కలిగి ఉంది, సూత్రాలు, వృత్తి, ఎనభై ఏడు సూత్రాలలో ఆరు శబ్దాలంకారాలు ,యాభై ఐదు అర్ధాలంకారాలు (ఇవి పరిణామము, రసవాదము, వికల్ప వంటి నుతన అలంకారాలను కలిగి ఉంటాయి). ఈ సూత్రాల వృత్తిలో భామహుడు రచించిన సర్వస్వకార నుండి కొన్ని సూత్రాల ప్రాథమిక ప్రాతినిధ్యాలు ఉన్నాయి-ఇవి వాటి వాటి స్వరూప భేధాలను ఉదాహరణలతో వివరించబడినాయి. దీనికి ముగ్గురు వ్యాఖ్యాతలు కాశ్మీర్ కు చెందిన జయరథుడు (క్రీ. శ. 1,193), కేరళకు చెందిన సముద్రబంధ (క్రీ. శ. 1300), గుజరాతుకు చెందిన శ్రీ విద్యాచక్రవర్త (క్రీ.శ 14వ శతాబ్దము) కలరు. ఇందులో మొదటి, చివరి వ్యాఖ్యాతలు అలంకారసర్వస్వ రచయిత రుయ్యకుడే అని నిస్సందేహంగా నమ్ముతారు. అలంకారికుల సుదీర్ఘ సంప్రదాయంలో, చిన్న చిన్న సందర్భాలలో మినహా, శోభాకర్ నుండి పండితరాజ జగన్నాథ్ వరకు అలంకారికులలో రుయ్యకుని గురించి ప్రస్తావించబడలేదు. పురాతన పాండులిపిలో కల పుష్పికలలో రుయ్యకుడు అలంకారసర్వస్వ రచయితగా ప్రకటిస్తాయి. అయితే సముద్రబంధుడు అలంకారసర్వస్వము మంఖకుని యొక్క పనిగా పరిగణించాడు. అందువలన ఇది ఒక అపోహ సంప్రదాయానికి దారితీసింది.

అలంకార సర్వస్వ పీఠికలో రుయ్యకుడు భామ, , రుద్రటుడుమొదలైన కవుల అలంకారప్రాధ్యాన్యవాదాన్ని ఇంకా వామనుని ఆచారాలలో ధ్వని వాదాలను వివరించాడు. భట్టనాయకుని భావము భోగవ్యాపారాన్ని, అనుమాన ప్రమాణాన్ని రూఢీపరుస్తాడు.