రెండవ నరసింహవర్మను
రాజసింహ పల్లవగా ప్రసిద్ది చెందిన రెండవ నరసింహవర్మను (రెండవ నరసింహ వర్మ)[1][2] (కామను ఎరా 700 – 729) పల్లవ రాజ్యానికి పాలకుడు. 695 నుండి 722 వరకు పాలించిన రెండవ నరసింహవర్మను రాజమల్లా అని కీరించబడ్డాడు అని సేను పేర్కొన్నాడు. మహాబలిపురంలో సముద్రతీర ఆలయం, ఈశ్వర, ముకుంద ఆలయాలు, దక్షిణ ఆర్కాటులోని పనమలై ఆలయం, కైలాసనాథరు ఆలయం నిర్మించిన ఘనత రాజసింహకు దక్కింది. [3] రాజసింహ పాలన గొప్ప సాహిత్య, నిర్మాణ పురోగతి కాలంగా ప్రసిద్ధి చెందింది. ఆయనను చరిత్రకారులు మొదటి మహేంద్రవర్మను, మొదటి నరసింహవర్మనుల వంటి గొప్ప పల్లవ పాలకులలో ఒకరు.
రెండవ నరసింహవర్మను | |
---|---|
Pallava King | |
పరిపాలన | 700–729 CE (29. years) |
పూర్వాధికారి | Paramesvaravarman I |
ఉత్తరాధికారి | Paramesvaravarman II |
వంశము | Mahendravarman III, Paramesvaravarman II |
రాజవంశం | Pallava |
తండ్రి | Paramesvaravarman I |
సింహాసనం అధిష్టించుట
మార్చురాజసింహ సింహాసనాన్ని అధిరోహించే సమయానికి పల్లవులు ఉపఖండంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా ఉన్నారు. ఆయన తండ్రి మొదటి పరమేశ్వరవర్మను పురాతన భారతదేశంలోని యోధులైన రాజులలో గొప్పవాడు. అమరావతి పల్లవ శాసనం ఆయనను ప్రశంసించింది: "శంభుడి (శివ) వలె శక్తివంతంగా బలంగా". మొదటి పరమేశ్వరవర్మను బలీయమైన శత్రువులందరినీ లొంగదీసుకుని పల్లవ సామ్రాజ్యాన్ని చాలా దూరం విస్తరించడు. రాజసింహ (695.CE-728.CE) పట్టాభిషేకం సందర్భంగా జారీ చేసిన పల్లవుల వయలూరు శాసనం, కృతయుగం, ద్వాపరయుగం, కలి యుగాల 54 మంది పాలకుల వంశం కొనసాగింపులో చక్రవర్తి రాజసింహ ఉన్నాడని పేర్కొంటున్నది. పల్లవుల గొప్ప యోధుడు పూర్వీకుడు అశ్వత్తామను తరువాత 47 మంది రాజులు ఇందులో ఉన్నారు.
భూభాగం
మార్చురాజసింహ తన ముందు ఉన్న పల్లవ రాజుల మాదిరిగానే గొప్ప సైనిక యోధుడు. ఆయన కాలంలో పల్లవులు ఒక ప్రధాన శక్తిగా గుర్తించబడ్డారని ఆయన చైనాతో రాయబారులను మార్పిడి చేశాడని చెప్పవచ్చు. సాధారణంగా ఆయన కాలం పెద్ద యుద్ధాల నుండి విముక్తి పొంది ఆగ్నేయాసియాలో పల్లవ ఆధిపత్యం కొనసాగింది.
దక్షిణ చైనా సైన్యాధికారి
మార్చు8 వ శతాబ్ధంలో టాంగు రాజవంశం రెండవ నరసింహవర్మనుతో సైనిక సంబధాలు ఏర్పరచుకుని టిబెట్టు సామ్రాజ్యదాడుల నుండి చైనాను రక్షించడానికి ఆయనను దక్షిణ చైనా సైనికాధిరిని చేసింది.[4]
సాహిత్య భాగస్వామ్యం
మార్చురాజసింహ నైపుణ్యం కలిగిన నాటక రచయిత, కవి. ఆయన సంస్కృతంలో చాలా రచనలు చేశారు. వీటిలో చాలా వరకు ప్రస్తుతం ఉనికిలో లేవు. ఆయన సంస్కృత నాటకాలలో రామాయణం, మహాభారతం, పురాణాల ఇతివృత్తాలు ఉన్నాయి. ఇప్పటికీ కేరళలో వాడుకలో ఉన్న కుటియాట్టం చాలా పురాతనమైన నృత్య నాటకంగా పరిగణించబడుతుంది. ఆయన కొన్ని నాటకాల (కైలాశోధనం వంటిది)ప్రదర్శనకు ఇది ఉపయోగించబడింది. చక్యారు కూతు మరొక పురాతన తమిళ నాటకీయ ఆరాధన సేవను కూడా చేస్తుంది. కృష్ణుడు కంస హత్యకు సంబంధించిన "కంసవధం" అనే మరొక నాటకాన్ని కూడా రాజు రాశాడు.
సంస్కృత సాహిత్యవేత్త దండి ఆయన ఆస్థానంలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఆయనను రాజు పోషించాడు కాని శాసనాలు గణనీయమైన స్థాయి పాండిత్యాలను సూచిస్తున్నందున ఆయన రచనల గురించి సంపూర్ణంగా తెలియదు. రాజసింహ గొప్ప భక్తుడు, ఆయన గొప్ప అగామికు ఆరాధన ఆచారాలను "ప్రిసెప్టరు ద్రోణ" లో ప్రావీణ్యం పొందిన ఘనత పొందాడు.[5]
ఆయన అన్ని విజయాల కోసం, రాజసింహను ప్రధానంగా శివుడి భక్తుడిగా, కనికరంలేని, సత్యవంతుడైన, డైహార్డు యోధుడు రాజుగా గుర్తుంచుకుంటారు. ఆయన ఉపఖండంలో పల్లవ సైన్యాలు ఆధిపత్యంగా ఉండేలా చూసుకున్నాడు. శివుడు రాజు కలలో కనిపించినట్లు ప్రసిద్ది చెందాడు. శివుడు ఆయన పట్టాభిషేకాన్ని వాయిదా వేయమని ఆదేశించాడు. ఎందుకంటే ఆయన మొదట పేదవాడైన సాధువు పూసలారును ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఈ సంఘటన రాజసింహ చాలా పల్లవ నిధి మంజూర్లలో, ఆయన తరువాత జరిగిన సంఘటనలలో బాగా వివరించబడింది.
మతం
మార్చురాజసింహ గొప్ప శివు భక్తుడు కాంచీపురంలో కైలాసనాథరు ఆలయాన్ని నిర్మించాడు.
రాజసింహను సాధారణంగా కలర్సింగ నాయనారు ("దుష్ట రాజుల గుంపుకు సింహం వంటి వాడు) నయనారు అని గుర్తించారు. 63 శైవ సాధువులలో ఆయన ఒకడు. సుందరారు, దండి, పూసలారులకు ఆయన సమకాలీనుడు. అతని గొప్ప రాణి రంగపటక గొప్ప సాధీమణి. రాజసింహ శౌర్యాన్ని ప్రజలు ఎంతగానో ఆరాధించారు. ఆయన "రణజయ", "శివచూడామణి" వంటి అనేక బిరుదులను తీసుకున్నాడు. రాజసింహ తిరువారూరులోని శివుడి ముందు సెరుతునైతో కలిసి ఒక నయన్మారు సాధువుగా ప్రకటించబడ్డాడు. ఆయన తనను తాను రాజుగా భావించలేదు. తనకుతాను శివుడికి నిజాయితీగల సేవకుడుగా భావించాడు.
నిర్మాణకళలో ఆసక్తి
మార్చురాజసింహ పాలన శాంతి, శ్రేయస్సుతో గుర్తించబడింది. ఆయన అనేక అందమైన దేవాలయాలను నిర్మించాడు.[5] కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం కాకుండా, రాజసింహ కాంచీలోని వైకుంఠ పెరుమాళు ఆలయం, మహాబలిపురంలోని సముద్రతీర ఆలయం సహా అనేక ఇతర దేవాలయాలను కూడా నిర్మించారు.[6][7] కాంచీపురంలో ఐరావతేశ్వర ఆలయాన్ని, పనమలై వద్ద తలగిరీశ్వర ఆలయాన్ని నిర్మించిన ఘనత కూడా ఆయనకుంది.[8]
వారసత్వం
మార్చురాజసింహకు మహేంద్రవర్మను, రెండవ పరశురామవర్మను అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడవ మహేంద్రవర్మను ఆయన తండ్రికంటే ముందుగానే మరణించాడు. అందువలన రెండవ పరమేశ్వరవర్మను తన తండ్రి సింహాసనాన్ని కామను ఎరా 728 లో అధిష్టించాడు.
రెండవ నరసింహవర్మను
| ||
అంతకు ముందువారు మొదటి పరమేశ్వరవర్మను |
పల్లవ రాజవంశం 695–722 |
తరువాత వారు మొదటి పరమేశ్వరవర్మను |
మూల వనరులు
మార్చు- ↑ Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland (in ఇంగ్లీష్). Royal Asiatic Society of Great Britain & Ireland. 1885.
- ↑ Thorpe, Edgar Thorpe, Showick. The Pearson CSAT Manual 2011 (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 9788131758304.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 41–44. ISBN 978-93-80607-34-4.
- ↑ "A 1,700-year-old Chinese connection". The Times of India. 4 సెప్టెంబరు 2019.
- ↑ 5.0 5.1 Tripathi, p450
- ↑ Ching, Francis D.K, A Global History of Architecture, p 274
- ↑ Keay, John, India: A History, p 174
- ↑ South Indian Inscriptions, Volume 12, ASI
వనరులు
మార్చు- Ching, Francis D.K.; et al. (2007). A Global History of Architecture. New York: John Wiley and Sons. ISBN 978-0-471-26892-5.
- Keay, John (2001). India: A History. New York: Grove Press. ISBN 0-8021-3797-0.
- Sen, Tansen (2003). Buddhism, Diplomacy, and Trade. University of Hawaii Press. ISBN 0-8248-2593-4.
- Tripathi, Rama Sankar (1967). History of Ancient India. India: Motilal Banarsidass Publications. ISBN 81-208-0018-4.
- South Indian Inscriptions, Volume 12
- A study on koodiyattam, UNESCO WORLD HERITAGE ART.