రేకుపల్లి భూపతి రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జన్మించిన రెడ్డిపల్లి భూపతిరెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి తన MBBS ను విజయవాడ హెల్త్ సైన్స్ నుండి తన MS ని పూర్తి చేసి వైద్యునిగా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు.

స్వరాష్ట్ర సదన కోసం సాగిన ఉద్యమంలో కేసీఆర్ పిలుపుమేరకు చేరిన భూపతిరెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్వరాష్ట్రసాధనకై పాటుపడ్డారు.

2001నుంచి 2009 వరకు నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా...2009-2014 వరకు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిగా సేవలందించారు.

2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఆ తర్వాత 2018లో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు .

2018 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2023 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు .


మూలాలు మార్చు

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.