రేఖాంశం
భూమి ఉపరితలంపై తూర్పు-పడమర లో ఒక బిందువు స్థానమ పేర్కొనే భౌగోళిక సమన్వయం.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భూగోళం మీద అడ్డంగా, నిలువుగా ఉండే కొన్ని రేఖలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. వీటిలో అడ్డంగా ఉండే ఊహారేఖలను అక్షాంశాలు అనీ, నిలువుగా ఉండే ఊహారేఖలను రేఖాంశాలు అనీ వ్యవహరిస్తారు[1]. వీటిని డిగ్రీలలో లెక్కిస్తారు.[2] ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు రేఖాంశంతో పాటు, అక్షాంశం కూడా తెలియాలి.
- - ఇవి అర్థ వృత్తాలు.
- - ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
- - భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
- - ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అని కూడా అంటారు.
- - 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. ఇదే ప్రధాన రేఖాంశం అంటారు.
- - గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 180 డిగ్రీల రేఖాంశంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
- - 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
- - 0 డిగ్రీల రేఖాంశం నుండి పడమర 180డిగ్రీల వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
- - భూమి 1డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
- - రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
- - రేఖాంశాలు భూమధ్యరేఖ ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.
- -ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
- - 15 డిగ్రీలకు ఒక కాలమండలం చొప్పున ప్రపంచాన్ని 360 రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
- - రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
- - లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
- - ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
- - రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
మూలాలు
మార్చు- ↑ reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "అక్షాంశాలు - రేఖాంశాలు". pratibha.eenadu.net. Retrieved 2021-07-29.
- ↑ B.Subbarayan (1990). Balala Vijnana Sarvasvamu-Samskruthi Vibhagamu (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)