రేఖా అండ్ మురళి ఆర్ట్స్

రేఖా అండ్ మురళి ఆర్ట్స్ (Rekha and Murali Arts) రంగస్థల, సినిమా నిర్మాణ సంస్థ. దీనికి ముఖ్యమైన అధిపతి నటుడు పద్మనాభం. వీరి మొదటి చిత్రం 1965లో నిర్మించిన దేవత. రేఖ వల్లం నరసింహరావు గారి అమ్మాయి, మురళి పద్మనాభం గారి అబ్బాయి. ఇద్దరి పేర్లు కలిపి ఈ సంస్థ పేరును నిర్ణయించారు.

కథానాయిక మొల్ల ఈ సంస్థ నిర్మించిన నంది ఉత్తమచిత్రం.

ఈ సంస్థ మొదట నాటక ట్రూపుగా ప్రారంభమైనది. తర్వాత కాలంలో సినీ నిర్మాణంలో ప్రవేశించారు. దీనిలో స్నేహితులు వీటూరి, వల్లం నరసింహారావు, పద్మనాభం గారి తమ్ముడు పురుషోత్తం, సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి, దర్శకులు కె.హేమాంబరధరరావు, నటులు పెరుమాళ్ళు, దండు వెంకటరాజు, కేశవరామ్ లు భావస్వాములు.[1]

నిర్మించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినీ వివరాలలో పద్మనాభం". Archived from the original on 2008-10-25. Retrieved 2009-09-18.

బయటి లింకులు

మార్చు