రేచీకటి
రేచీకటి (Night blindness) ఆహారంలో విటమిన్ ఎ లోపం కారణంగా ఎక్కువగా పిల్లలకు సంభవిస్తున్న వ్యాధి. కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా, పొడి ఆరిపోయినట్లుగా ఉండును. కంటి గ్రుడ్డు మీక తెల్లని మచ్చలు కనబడును. వ్యాధిగ్రస్తులు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడలేరు. ఇంకా అశ్రద్ధ చేస్తే అంధత్వము కలుగవచ్చును.
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
---|---|
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న బొప్పాయి, కారట్, కోడిగ్రుడ్డు, తాజా ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో సమృద్ధిగా ఇవ్వాలి. అంధత్వ నిర్మూలన పధకం క్రింద దేశంలోని పిల్లల్ని రేచీకటి నుండి రక్షించడానికి 9 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకి 6 నెలల కొకసారి విటమిన్ ఎ ద్రావణం నోటిద్వారా ఇస్తున్నారు.
రేయి చీకటిసవరించు
పగలు కనిపిస్తూ రాత్రి సమయానికి అనగా రేయి సమయానికి వెలుతురులో కూడా చీకటిగా ఉండుట వలన ఈ వ్యాధిని రేయి చీకటి అని రేచీకటి అని అంటారు.