రేడియన్
రేడియన్ లేదా సమత్రిజ్యాకోణం అనేది కోణాల కొలత యొక్క ఒక ప్రమాణము. ఇది "rad" అనే చిహ్నంచే సూచించబడుతుంది. చాలా అరుదుగా c (వృత్త కొలతకు) అనే చిహ్నంతో కూడా సూచించబడుతుంది. ఈ రేడియన్ ఒకప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి యొక్క అనుబంధ యూనిట్ గా ఉండినది, కాని 1995 లో దీనిని SI యూనిట్ నుంచి తొలగించారు. అయినప్పటికి ప్రస్తుతం దీనిని అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి నుంచి ఉత్పన్నమయిన ప్రమాణముగానే భావిస్తారు.
ఒక "మిల్లీరేడియన్" అనగా ఒక రేడియన్ యొక్క 1/1000 భాగం
రేడియన్‌లను ఎవరు ఉపయోగిస్తారు
మార్చుఎక్కువ మంది ప్రజలు డిగ్రీల కంటే రేడియన్లనే గణితం లేదా భౌతికశాస్త్రంలో ఉపయోగిస్తారు, ఎందుకంటే లెక్కించే కొన్ని పద్ధతులలో ముఖ్యంగా త్రికోణమితి, కలన గణితంలో డిగ్రీల కన్నా రేడియన్లను ఉపయోగించడం సులభం. టెలిస్కోప్ లేదా రైఫిల్ స్కోప్ ద్వారా చూసే వ్యక్తులు వారు చూసే దూరాలను వివరించడానికి తరచుగా మిల్లీరేడియన్లను ఉపయోగిస్తారు. ఈ కొలత ప్రమాణమును ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వీడియో గేమ్‌లలో భౌతికశాస్త్ర సంబంధమైన ద్రవ్యరాశి ప్రభావము కొరకు తరచుగా ఉపయోగిస్తారు.
మార్పిడి
మార్చు1 రేడియన్ అనేది దాదాపు 57.3° లకు సమానం. ఇక్కడ ఒక సంపూర్ణ వృత్తంలో 2π రేడియన్స్ (సుమారు 6.28 రేడియన్స్) ఉంటాయి.
ఈ క్రింది ఫార్ములా డిగ్రీల నుంచి రేడియన్లలోకి మార్చుటకు
లేదా:
ఇలా కూడా చెప్పవచ్చు:
- .