రేడియేషన్ థెరఫీ లేదా రేడియో థెరపీ (రేడియో చికిత్స) అనేది అయొనైజింగ్ రేడియేషన్ సాయంతో చేసే చికిత్సా పద్ధతి. ఇది సాధారణం క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అదుపు తప్పిన కణాలను నిర్మూలించడానికి వాడతారు. సాధారణంగా లీనియర్ పార్టికల్ ఆక్సెలరేటర్ ను ఉపయోగించి చేస్తారు. ఈ చికిత్స క్యాన్సరు శరీరంలో కొన్ని అవయువాలకు మాత్రమే పరిమితం అయి మిగతా వాటికి వ్యాపించనపుడు దానిని సమర్ధవంతంగా నిరోధిస్తుంది. శస్త్రచికిత్స ద్వారా ప్రాథమిక స్థాయిలో ఉన్న క్యాన్సర్ కణితులను తొలగించిన తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా కూడా ఈ చికిత్స చేస్తారు. రేడియో చికిత్సలో నిపుణుడైన వైద్యుడిని రేడియో అంకాలజిస్టు అని పిలుస్తారు.

రేడియో చికిత్స కణాల పెరుగుదలను అరికడుతుంది కాబట్టి క్యాన్సర్ ని అరికట్టడంలో విరివిగా ఉపయోగిస్తారు. అయొనైజింగ్ రేడియేషన్ క్యాంసర్ కణాలయొక్క డిఎన్‌ఏ మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది.

మందులు

మార్చు

మూలాలు

మార్చు