రేవల్చిన్ని కుటుంబము
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
రేవల్చిన్ని కుటుంబము
ఈ కుటుంబమున గుల్మములు మాత్రము గలవు. ఆకులు సాధారణంగా ఒంటరి చేరికగా నుండును. కణుపు పుచ్చములున్నవి. అవి కొమ్మల నంటి పెట్టుకొని యుండును. ఉప వృంతమునకును పుష్పమునకును మధ్య సతుకు గలదు. పువ్వులు మిధునములే కాని కొన్నిటిలో ఏక లింగ పుష్పములును పుట్టు చున్నవి. పుష్పనిచోళమునందు మూడు మొదలు ఆరు వరకు దళములున్నవి. అవి విడివిడిగానైనను గలసియైనను నుండును. కింజల్కములు వీని కెదురుగా నుండుట చే ఇవి రక్షక పత్రములని యూహించ వచ్చును. ఇవి రాలి పోకుండ స్థిరముగ నుండును. కింజల్కములు అయిదు మొదలేనిమిది వరకు గలవు. అండాశయములో గదులు మూడు లోపు గింజలు నాలుగు లోపుగ నుండును. కాయ ఎండును గాని పగలదు.
రేవల్చిన్ని మొక్క హిమాలయా పర్వతముల ప్రాంతముల పదునొకొండు వేల అడుగుల ఎత్తుమీద పెరుగు చున్నది. ఈ మొక్క వేరును, మూలవహమును కోసి పై చర్మము వలచి వైచి ఎండ బెట్టి అంగళ్ళయందు అమ్ముచున్నారు. దీనినే రేవల్చిన్ని యందుము. దీనిని ఔషదములలో వాడుదురు. రేవల్చిన్ని మనకు చీనా, టిబెట్టు, దేశముల నుండియు లండను పట్టణం నుండియు కూడా వచ్చు చున్నది. మన దేపు పదార్థము కంటే బొరుగూరి పదార్థము మంచిదను చున్నారు. అట్లే యైనను మన మొక్కలను శ్రద్ధతో బెంచు నెడల అన్య దేశపు పదార్థమున కంటే తక్కువ రకముగాదని యూహించుట కవ కాశమున్నది.