రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్

(రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్ నుండి దారిమార్పు చెందింది)

రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ (Rice University's Reverse Transliteration Standard లేదా Romanization of Telugu, క్లుప్తంగా RTS) తెలుగు ని ఆంగ్ల అక్షరాలతో వ్రాసే ప్రక్రియ. దీనిని ఆనంద్ కిషోర్, రామారావు కన్నెగంటి సృష్టించారు. [1] పద్మ ఉపకరణంలో దీనిని వాడిన తీరుపై పత్రంలో తెలుగు అక్షరాలతో చూడవచ్చు[2] దీనిని 2002 లో వేమూరి రావు ఆంగ్ల-తెలుగు నిఘంటువు (English-Telugu Dictionary - ISBN 8120616367 లో వాడబడింది. ధ్వని చిహ్నాలతో రాసే ప్రక్రియకు బదులుగా వాడతారు. తొలిగా వికీపీడియాలో ఈ పద్ధతి మాత్రమే వాడేవారు.

ఉబుంటు లో SCIM సాఫ్ట్వేర్ తో RTS తెలుగు టైపు చేయడం(Circa 2006)
ఫెడోరా కోర్ లో IIIM సాఫ్ట్వేర్ తో RTS తెలుగు టైపు చేయడం(Circa 2006)

దీనిలో హ్రస్వ అచ్చులను ఆంగ్ల అచ్చుల చిన్న అక్షరములతో ధీర్ఘ అచ్చులను పెద్ద అక్షరములతో రాస్తారు. అ = a, ఆ = A;

వత్తురూపం కాని హల్లులను ఆంగ్ల హల్లుతోపాటు సంబంధిత అచ్చు చిన్న అక్షరంతో వ్రాస్తారు.

తరువాత వికీపీడియా లో వాడినపుడు దీర్ఘ అచ్చులకు ఆంగ్ల చిన్న అక్షరము రెండుసార్లు వ్రాసిన సరిపోయే సౌలభ్యాన్ని చేర్చారు.

సాధారణ అక్షరాలు

మార్చు
a A = aa = aaa i I = ee = ii = ia u oo = uu = U = ua R Ru ~l ~L e ea = ae = E ai o oe = O = oa au = ou M @h @M
ం (aM = అం) ః (a@h =అః)
ka kha = Ka = Kha g gha = Ga = Gha ~ma ca = cha Ca = Cha ja jha = Ja = Jha ~na Ta Tha Da Dha Na = nha ta tha da dha na
pa fa = Pa = pha = Pha ba bha = Ba = Bha ma ya ra la va = wa Sa sha sa ha La = lha = Lha xa = ksha ~ra
క్ష

ప్రత్యేక విషయాలు

మార్చు

నకార పొల్లు

మార్చు

@n నకారపొల్లుకు వాడాలి.

సున్న తయారి

మార్చు
  • n లేక m { ka, Ka, ga, Ga, ca, Ca, ja, Ja, Ta, Tha, da, dha, pa, Pa, ba, Ba లేక సరిసమానమైనవి} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా:kanchu కంచు
  • m, { Ia, va, sa, Sa} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా: samchi సంచి

సున్న తయారీ నిరోధించు (&)

మార్చు
  • పైన తెల్పిన సున్న తయారీ ప్రక్రియ కారణంగా కొన్ని పరభాషా పదాలు రాసేటప్పుడు రూపం సరిగా రాదు ఉదా:మన ఉసిరికి సంస్కృత పదం aamla ఆమ్ల .
  • సున్నగా మారకుండా వుండాలంటే m లేక n తరువాత & చేర్చాలి
    ఉదా:aam&la ఆమ్ల, paan&pu పాన్పు, kaan&pu కాన్పు, sain&sus సైన్సు

ధ్వని విరుచు ^

మార్చు

sAfTuvErku సాఫ్టువేర్కు
sAfTuvEr^ku సాఫ్టువేర్‌కు
raangnembar రాంగ్నెంబర్
raang^nembar రాంగ్‌నెంబర్

ఇతర లిప్యంతరీకరణలతో పోలిక

మార్చు

ఒక పరిశోధనలో RTS పద్ధతి ఇతర పద్ధతులకన్న గుర్తుపెట్టుకోవటం, వాడుకకు మెరుగైనదిగా తెలపబడింది.[3]

ఇవికూడా చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. "1992 లో రాసిన, తెలుగుని ఇంగ్లీషు అక్షరాలతో ఎలా రాయాలో అనంద్ కిషోర్, కన్నెగంటి రామారావు ల న్యూస్ గ్రూప్ లో పోస్టింగు". 1992-09-23. Archived from the original on 2007-08-13. Retrieved 2007-07-13.
  2. "Padma" (PDF). 2005.
  3. VB Soumya (2008-09-01). Text input methods for Indian languages (PDF). Univ of Hyderabad. Archived from the original (PDF) on 2017-07-05.