రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్
రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ (Rice University's Reverse Transliteration Standard లేదా Romanization of Telugu, క్లుప్తంగా RTS) తెలుగు ని ఆంగ్ల అక్షరాలతో వ్రాసే ప్రక్రియ. దీనిని ఆనంద్ కిషోర్, రామారావు కన్నెగంటి సృష్టించారు. [1] పద్మ ఉపకరణంలో దీనిని వాడిన తీరుపై పత్రంలో తెలుగు అక్షరాలతో చూడవచ్చు[2] దీనిని 2002 లో వేమూరి రావు ఆంగ్ల-తెలుగు నిఘంటువు (English-Telugu Dictionary - ISBN 8120616367 లో వాడబడింది. ధ్వని చిహ్నాలతో రాసే ప్రక్రియకు బదులుగా వాడతారు. తొలిగా వికీపీడియాలో ఈ పద్ధతి మాత్రమే వాడేవారు.
దీనిలో హ్రస్వ అచ్చులను ఆంగ్ల అచ్చుల చిన్న అక్షరములతో ధీర్ఘ అచ్చులను పెద్ద అక్షరములతో రాస్తారు. అ = a, ఆ = A;
వత్తురూపం కాని హల్లులను ఆంగ్ల హల్లుతోపాటు సంబంధిత అచ్చు చిన్న అక్షరంతో వ్రాస్తారు.
తరువాత వికీపీడియా లో వాడినపుడు దీర్ఘ అచ్చులకు ఆంగ్ల చిన్న అక్షరము రెండుసార్లు వ్రాసిన సరిపోయే సౌలభ్యాన్ని చేర్చారు.
సాధారణ అక్షరాలు
మార్చుa | A = aa = aaa | i | I = ee = ii = ia | u | oo = uu = U = ua | R | Ru | ~l | ~L | e | ea = ae = E | ai | o | oe = O = oa | au = ou | M | @h | @M |
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ం (aM = అం) | ః (a@h =అః) | ఁ |
ka | kha = Ka = Kha | g | gha = Ga = Gha | ~ma | ca = cha | Ca = Cha | ja | jha = Ja = Jha | ~na | Ta | Tha | Da | Dha | Na = nha | ta | tha | da | dha | na |
క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న |
pa | fa = Pa = pha = Pha | ba | bha = Ba = Bha | ma | ya | ra | la | va = wa | Sa | sha | sa | ha | La = lha = Lha | xa = ksha | ~ra | ||||
ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ప్రత్యేక విషయాలు
మార్చునకార పొల్లు
మార్చు@n నకారపొల్లుకు వాడాలి.
సున్న తయారి
మార్చు- n లేక m { ka, Ka, ga, Ga, ca, Ca, ja, Ja, Ta, Tha, da, dha, pa, Pa, ba, Ba లేక సరిసమానమైనవి} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా:kanchu కంచు
- m, { Ia, va, sa, Sa} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా: samchi సంచి
సున్న తయారీ నిరోధించు (&)
మార్చు- పైన తెల్పిన సున్న తయారీ ప్రక్రియ కారణంగా కొన్ని పరభాషా పదాలు రాసేటప్పుడు రూపం సరిగా రాదు ఉదా:మన ఉసిరికి సంస్కృత పదం aamla ఆమ్ల .
- సున్నగా మారకుండా వుండాలంటే m లేక n తరువాత & చేర్చాలి
ఉదా:aam&la ఆమ్ల, paan&pu పాన్పు, kaan&pu కాన్పు, sain&sus సైన్సు
ధ్వని విరుచు ^
మార్చుsAfTuvErku సాఫ్టువేర్కు
sAfTuvEr^ku సాఫ్టువేర్‌కు
raangnembar రాంగ్నెంబర్
raang^nembar రాంగ్‌నెంబర్
ఇతర లిప్యంతరీకరణలతో పోలిక
మార్చుఒక పరిశోధనలో RTS పద్ధతి ఇతర పద్ధతులకన్న గుర్తుపెట్టుకోవటం, వాడుకకు మెరుగైనదిగా తెలపబడింది.[3]
ఇవికూడా చూడండి
మార్చువనరులు
మార్చు- ↑ "1992 లో రాసిన, తెలుగుని ఇంగ్లీషు అక్షరాలతో ఎలా రాయాలో అనంద్ కిషోర్, కన్నెగంటి రామారావు ల న్యూస్ గ్రూప్ లో పోస్టింగు". 1992-09-23. Archived from the original on 2007-08-13. Retrieved 2007-07-13.
- ↑ "Padma" (PDF). 2005.
- ↑ VB Soumya (2008-09-01). Text input methods for Indian languages (PDF). Univ of Hyderabad. Archived from the original (PDF) on 2017-07-05.