రోగ లక్షణం అనేది ఒక రోగి సాధారణ చర్య లేదా భావన నుండి గమనించబడిన ఒక తప్పిదం, ఇది రోగి అసాధారణ స్థితి యొక్క లేదా ఒక వ్యాధి యొక్క ఉనికిని ప్రతిబింబిస్తుంది. రోగలక్షణమును ఆంగ్లంలో సింప్టమ్ అంటారు. రోగ లక్షణమును రోగ గుణము, రోగ చిహ్నము, రోగ సూచిక అని కూడా అంటారు.కొన్ని రోగ లక్షణములను రోగి ముందుగా పసిగట్టగలుగుతాడు, అయితే దాని యొక్క తీవ్రతను సరిగా అంచనా వేయలేడు, అయితే అనుభవమున్న కొందరు రోగి లక్షణములను నిశితంగా పరిశీలించి అది ఎటువంటి రోగమో చెప్పగలుగుతారు.[1]

థర్మామీటర్ - మనిషి ఉష్ణోగ్రత పరిశీలించే సాధనము

చరిత్ర మార్చు

జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.మనిషిలో సాధారణ శరీర ఉష్ణోగ్రత 97.5 ° F నుండి 99.5 ° F (36.4 ° C నుండి 37.4 ° C) వరకు ఉంటుంది. ఇది ఉదయం తక్కువగా, సాయంత్రం ఎక్కువగా ఉంటుంది. వైద్యులు జ్వరాన్ని 100.4 ° F (38 ° C) లేదా అంతకంటే ఎక్కువ, 99.6 ° F నుండి 100.3 ° F ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తికి తక్కువ గా జ్వరం ఉంటుంది. కొన్ని సార్లు జ్వరాలు పిల్లలలో మూర్ఛలు కలిగిస్తాయి. జ్వరం సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంటుంది. పిల్లలు, చిన్న పిల్లలను, వికలాంగుల కు జ్వరం వచ్చినపుడు జాగ్రత గా ఉండవలెను . జ్వరం అనేది అనారోగ్యం కాదు. శరీరంలో ఏదో సరిగ్గా లేదని ఇది ఒక లక్షణం. ఇది బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ , ఆహారం నుండి కావచ్చు [2]

రోగ ( జ్వరం ) లక్షణములు

1, చలి -వణుకుత

2. చెమటలు పట్టుట

3. ఆకలి తక్కువగా ఉండడం .

4, శరీరంలో నొప్పులు

5. అలసట - నీరసం గా ఉండడం

6. నిద్ర పట్టకపోవడం

చిన్న పిల్లల లో రోగ ( జ్వర ) లక్షణములు మార్చు

చలి, శరీరం, వేడిగా ఉండడం ,చెమటలు ,మతిమరుపు, జ్వరం ఎక్కువ గా ఉంటే కొన్ని సార్లు మూర్ఛలు రావచ్చును. జ్వరం ఉన్న పిల్లలు ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ పిల్లలో చికాకు , 100.4 ° F (38 ° C) కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటె వెంటనే వైద్యులను సంప్రదించ వలెను.3 నెలల వయస్సు పిల్లలకు 100.4 ° F (38 ° C) ఉష్ణోగ్రత ఉంటే చిన్నపిల్లలలో జ్వరం ప్రమాదం , ఏ వయస్సులోనైనా 104 ° F (40 ° C) ఉష్ణోగ్రత ఉండడం ప్రమాదము, ,2 సంవత్సరాల పిల్లకు 100.4 ° F (38 ° C) జ్వరం 1 రోజు కంటే ఎక్కువ ఉంటుంది. పిల్లల వయస్సు 2 లేదా అంతకంటే ఎక్కువ 100.4 ° F (38 ° C) జ్వరం 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది  [3] [4]

జ్వరం తీవ్రతను( ఉష్ణోగ్రత) గుర్తించడం మార్చు

నోటిలో ఉష్ణోగ్రత తీసుకోవడానికి ఓరల్ థర్మామీటర్లను ఉపయోగిస్తారు. పిల్లల కంటే పెద్దవారికి నోటి ద్వారా ఉష్ణోగ్రత తీసుకోవడం మంచిడి , థర్మామీటర్‌తో కనీసం 20 సెకన్ల పాటు నోరు మూసుకుని ఉండాలి. చెవి ఆధారిత థర్మామీటర్లు టిమ్పానిక్ పొర యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తాయి. దీనిని చెవిపోటు అంటారు.చెవి ఆధారిత థర్మామీటర్ డిజిటల్ రీడౌట్‌ను ఉపయోగిస్తుంది,సెకన్లలో ఫలితాలను అందిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలో వాడవచ్చును . థర్మామీటర్ లేకుండా జ్వరాన్ని తెలుసుకొన వచ్చును . శరీరం ను తాకి మనిషిలో ఉన్న ఉష్ణోగ్రత ను చూడటం, డీహైడ్రేషన్, విరేచనములు , వాంతులతో మనిషి బాధ పడటం వంటివి రోగ లక్షణములను గుర్తించ వచ్చును [5]

మూలాలు మార్చు

  1. Devroede G (1992). "Constipation—a sign of a disease to be treated surgically, or a symptom to be deciphered as nonverbal communication?". J. Clin. Gastroenterol. 15 (3): 189–91. doi:10.1097/00004836-199210000-00003. PMID 1479160.
  2. "Articles". Cedars-Sinai (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-05-30. Retrieved 2020-11-21.
  3. "Fever: Symptoms, treatments, types, and causes". www.medicalnewstoday.com (in ఇంగ్లీష్). 2020-05-05. Retrieved 2020-11-21.
  4. "default - Stanford Children's Health". www.stanfordchildrens.org. Retrieved 2020-11-21.
  5. "How to Tell If You Have a Fever". Healthline (in ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2020-11-21.