రొయ్య శ్వాసవ్యవస్థ

(రోయ్య శ్వాసవ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)

రొయ్యలో శ్వాసక్రియ మూడు రకాల శ్వాసాంగాల వల్ల జరుగుతుంది. ఆవి:

  1. పృష్ఠకవచపు ఆంత్రవేష్ఠనం లేదా మొప్పకప్పలు లేదా బ్రాంకియోస్తీగైట్.
  2. ఎపిపొడైట్ లు (Epipodites)
  3. మొప్పలు (Gills)
రొయ్యలు

పృష్ఠకవచపు ఆంత్రవేష్ఠనం లేదా మొప్పకప్పలు లేదా బ్రాంకియోస్తీగైట్.

మార్చు

బాహ్యంగా మొప్పకప్పుకు లోపలివైపు ఉరం గోడకు మధ్యహగల స్థలంలో జలశ్వసకుహరం ఉంటుంది. ప్రతీ జలశ్వసకుహరం ఒక పృష్ఠతలంలో తప్ప అన్ని వైపులా తెరచుకోని ఉంటుంది. ఈ బ్రాంకియోస్తీగైట్లు లోపలి అంచులు పలచగా, త్వచం లాగా ఆనేక రక్త లిక్విణులతో ఉంటాయి.ఈ శ్వాసావయం ఎల్లప్పుడు నీటిలో మునిగి ఉండటం వల్ల శ్వాసక్రయ తలాన్ని ఏర్పరుస్తుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి, రక్తంలోని CO2 నీటిలోకి విడుదలవుతాయి.

ఎపిపొడైట్ లు(Epipodites)

మార్చు

ఇవి మూడు జతలు. ఇవి ఆకులలాగా పలుచగా రక్తకుహరాలతో కూడి జంభికా పాదాల కోక్సా-పోడోమియర్ ల చర్మం నుంచి పొడుచుకు వచ్చిన అవయవాలు. ఇవి జలశ్వస కుహరం పూర్వభాగంలో స్కాఫోగ్నాథైట్ కు కింద ఉంటాయి. ఇవి నీటిలో మునిగి ఉంటాయి. ఈ శ్వాస అవయవాలను ప్రథమిక మొప్పలు అని చెప్పవచ్చు.

మొప్పలు (Gills)

మార్చు

రొయ్యలో మొత్తం ఎనిమిది జతల మొప్పలు (Gills) ఉంటాయి. మొప్పకప్ప వీటిని కప్పి ఉంటుంది. మొప్పల పుట్టక అవి ఉండే స్థానాన్ని అనుసరించి ఇవి మూడు రకాలు.

  • పోడోబ్రాంక్ లేదా పాద మొప్పలు : ఉపాంగాల కోక్సాలకు అతికి ఉన్న మొప్పను పోడోబ్రాంక్ లు అంటారు. .ప్రతీ రెండవ జంభికాపాదాల కోక్సాకు ఒక పోడోబ్రాంక్ అతికి ఉంటుంది.
  • ఆర్థ్రోబ్రాంక్ : ఉపాంగాన్ని, ఉరాన్ని కలిపే ఆర్థ్రోయిడల్ త్వచానికి అతికి ఉన్న మొప్పను ఆర్థ్రోబ్రాంక్ అంటారు. ప్రతీ మూడవ జత జంభికాపాదాలా ఆర్థ్రోయిడల్ త్వచానికి రెండు ఆర్థ్రోబ్రాంక్ అతికి ఉంటాయి.
  • ప్లూరోబ్రాంక్ లేదా పర్శ్వమొప్ప: ఉపాంగం ఉన్న ఖండితం పార్వ్శాలకు అతికి ఉన్న మొప్పలను ప్లూరోబ్రాంక్ అంటారు.

మొప్ప నిర్మాణం

మార్చు

ప్రతీ మొప్ప దాదాపు అర్ధచంద్రాకారంలో, క్రమంగా పూర్వపరాల్లో పెరిగి ఉంటుంది. ప్రతి మొప్ప దాని ముండున్న మొప్పకంటె పెద్దగ ఉంటుంది.మొప్ప పృష్థతలం జలశ్వాస కుహరపు పూర్వపృష్థ గుంటలోనికి చొచ్చుకొని ఉంటుంది. రొయ్యలో గల మొప్పలన్నీ ఫిల్లోబ్రాంక్ రకానికి చెందినవి.మొప్ప యొక్క పృష్టభాగము మొప్ప కుహరములోనికి, ఉదర భాగము మొప్పమూలము ద్వారా శరిరకుడ్యముతో కలపబధి యుండును.

శ్వాసక్రియ విధానం

మార్చు

జంభికల యొక్క స్కాఫోగ్నాధైతటులు నిరంతరము కదులుచుండుట వలన నీరు రెందు వైపులనున్న జలశ్వాస కుహరము లేక మెప్ప కుహరములలోనికి వచ్చును. అది మొప్పలు ఎపిపొడైటులు మేదగా ప్రవహించి మొప్ప కుహరము పూర్వ పృష్టభాగము గుండా బయటకు పోవును. మొప్పలు, ఎపిపొడైటుల వద్ద వాయు వినిమయము జరిగి రక్తము శుభ్రపడును.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు