రోహిణి నక్షత్రం

(రోహిణి నక్షత్రము నుండి దారిమార్పు చెందింది)

నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
రోహిణి చంద్రుడు మానవ స్త్రీ నేరేడు పాము అంత్య గుడ్లగూబ బ్రహ్మ వృషభం

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

మార్చు
తార నామం తారలు ఫలం
జన్మ తార రోహిణి, హస్త, శ్రవణం శరీరశ్రమ
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ ధన లాభం
విపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్యహాని
సంపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర క్షేమం
ప్రత్యక్ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ప్రయత్న భంగం
సాధన తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్య సిద్ధి, శుభం
నైత్య తార అశ్విని, మఖ, మూల బంధనం
మిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం
అతిమిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం, లాభం

రోహిణి నక్షత్రము నవాంశ

మార్చు
  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

రోహిణి నక్షత్రము గుణగణాలు

మార్చు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

చిత్ర మాలిక

మార్చు