రోహిణి రాకెట్
రోహిణి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన సౌండింగ్ రాకెట్‌ల శ్రేణి. వాతావరణ అధ్యయనం కోసం ఈ రాకెట్‌ను తయారు చేసారు. ఈ శ్రేణిలో ప్రస్తుతం RH-200, RH-300 Mk-II, RH-560 Mk-II రాకెట్లు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి 8 నుండి 100 కిలోగ్రాముల పేలోడ్లను మోసుకుపోగలవు. 80 నుండి 470 కిలోమీటర్ల ఎత్తుకు చేరగలవు.[1] ఈ రాకెట్లను తుంబాలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS), ఒరిస్సాలోని బాలసోర్, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ల నుండి ప్రయోగిస్తారు.
పేరు వివరణ
మార్చురోహిణి శ్రేణిలోని రాకెట్ల పేర్లు ఇంంగ్లీషు పేరు ప్రకారం RH ("Rohini") తో మొదలౌతాయి. ఆ తరువాత వచ్చే సంఖ్య దాని వ్యాసాన్ని మిల్లీమీటర్లలో సూచిస్తుంది. .[2]
శ్రేణి
మార్చు- RH-75
భారత్ స్వంతంగా తయారుచేసిన మొదటి సౌండింగు రాకెట్టు RH-75.[3] 1967 నవంబరు 20 న దీన్ని తొలిసారి ప్రయోగించారు, TERLS నుండి.[4] అది 75 మిల్లీమీటర్ల వ్యాసంతో, 32 కిలోగ్రాముల బరువుంది. 1968 సెప్టెంబరు వరకు దాన్ని 15 సార్లు ప్రయోగించారు.
- RH-125
RH-125 ను మొదటిసారి 1971 అక్టోబరు 9 న శ్రీహరికోట నుండి మొదటిసారి ప్రయోగించారు. ఘన ఇంధనాన్ని ఉపయోగించే రెండు దశల రాకెట్టు అది. 7 కెజి బరువును 19 కిమీ ఎత్తుకు తీసుకుపోగలదు. 1970 జనవరి, 1971 అక్టోబరుల మధ్య అది రెండు సార్లు ప్రయణించింది.
- RH-200
RH-200 గరిష్ఠంగా 80 కిమీ ఎత్తుకు చేరగలదు. దీని మరొక కూర్పు RH-300 Mk-II, 160 కిమీ ఎత్తుకు, మరో కూర్పు RH-560 Mk-II, 470 కిమీ ఎత్తుకూ చేరగలవు.
అనువర్తనలు
మార్చుRH-200 ను వాతావరణ పరిశీలనలకు వాడుతారు. RH-300 Mk-II ను ఉచ్ఛ వాతావరణ పరిశీలనకు, RH-560 Mk-II అయనావరణ పరిశీలనకు వాడుతారు.
పేరు | RH 75 | RH 125 | RH 200/125 | RH-300 | RH-300 Mk II | RH-300/200/200 | RH-560/300 | RH-560/300 Mk II |
---|---|---|---|---|---|---|---|---|
మొత్తం ద్రవ్యరాశి | 8 కెజి (18 పౌ) | 40 కెజి (88 పౌ) | 100 కెజి (220 పౌ) | 300 కెజి (660 పౌ) | 500 కెజి (1,100 పౌ) | 500 కెజి (1,100 పౌ) | 1,300 కెజి (2,800 పౌ) | 1,600 కెజి (3,530 పౌ) |
ఎత్తు | 1.50 మీ (4.90 అ) | 2.50 మీ (8.20 అ) | 3.60 మీ (11.80 అ) | 4.10 మీ (13.40 అ) | 5.90 మీ (19.30 అ) | 8.00 మీ (26.20 అ) | 8.40 మీ (27.50 అ) | 9.10 మీ (29.80 అ) |
వ్యాసం | 0.0800 మీ (0.2620 అ) | 0.12 మీ (0.39 అ) | 0.20 మీ (0.65 అ) | 0.31 మీ (1.01 అ) | 0.31 మీ (1.01 అ) | 0.31 మీ (1.01 అ) | 0.56 మీ (1.83 అ) | 0.56 మీ (1.83 అ) |
థ్రస్టు | 8.00 కిన్యూ (1,798 పౌఫో) | 17.00 కిన్యూ (3,821 పౌఫో) | 38.00 కిన్యూ (8,542 పౌఫో) | 39.00 కిన్యూ (8,767 పౌఫో) | 38.00 కిన్యూ (8,542 పౌఫో) | 76.00 కిన్యూ (17,085 పౌఫో) | 76.00 కిన్యూ (17,085 పౌఫో) | |
అపోజీ | 10 కిమీ (6.2 మై) | 20 కిమీ (12 మై) | 80 కిమీ (50 మై) | 100 కిమీ (62 మై) | 150 కిమీ (93 మై) | 300 కిమీ (190 మై) | 400 కిమీ (250 మై) | 500 కిమీ (310 మై) |
దశలు | 1 | 1 | 2 | 1 | 1 | 3 | 2 | 2 |
తొలి ప్రయోగం | 1967 నవంబరు 20 | 1970 జనవరి 1 | 1979 జనవరి 1 | 1987 జూన్ 8 | 1985 నవంబరు 1 | 1974 ఏప్రిల్ 24 | 1995 ఆగస్టు 16 | |
పేలోడ్ (కెజి) | 1 | 7 | 10 | 60 | 70 | 100 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు వనరులు
మార్చు- ↑ ఇస్రో వెబ్‌సైటు
- ↑ "ISRO > FAQ". Frequently Asked Questions: ISRO. Indian Space Research Organisation.
- ↑ Chari, Sridhar K (22 July 2006). "Sky is not the limit". The Tribune. Retrieved 10 March 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-03. Retrieved 2016-08-09.