రోహిణీ సింధూరి భారతదేశానికి చెందిన ఐఏఎస్‌ అధికారిణి. రోహిణి 2009 కర్ణాటక క్యాడర్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి..[1] ఆమె ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లా డీసీగా విధులు నిర్వహిస్తుంది. 2009లో జరిగిన యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (యూపీఎస్సీ) పరీక్షల్లో ఆమె 43వ ర్యాంకు సాధించింది.[2] ఆమె ఐ.ఏ.ఎస్ గా పలు డిపార్ట్మెంట్లలో పనిచేసింది.

రోహిణీ సింధూరి
రోహిణీ సింధూరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17-7-2017 - Feb 2019

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పంచాయత్, మండ్య , కర్ణాటక రాష్ట్రం
పదవీ కాలం
31 మే 2014 – 15 సెప్టెంబర్ 2015

డైరెక్టర్ రురల్ డెవలప్మెంట్ & పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రాజెక్ట్. బెంగుళూరు.
పదవీ కాలం
10 ఆగష్టు 2013 – 31 మే 2014

కమీషనర్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ - తుంకూర్
పదవీ కాలం
31 ఆగష్టు 2012 – 31 డిసెంబర్ 2012.

అసిస్టెంట్ కమీషనర్ - తుంకూర్
పదవీ కాలం
29 ఆగష్టు 2011 – 31 ఆగష్టు 2012.

వ్యక్తిగత వివరాలు

జననం (1984-05-30) 1984 మే 30 (వయసు 39)
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.
జీవిత భాగస్వామి సుధీర్ రెడ్డి
వృత్తి ఐఏఎస్‌ అధికారిణి

జననం మార్చు

రోహిణీ సింధూరి 1984 మే 30 లో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో జన్మించింది. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. ఆమె తల్లి శ్రీలక్ష్మీరెడ్డి, తండ్రి దాసరి జయపాల్‌రెడ్డి.

రోహిణి ఇంజనీరింగ్‌ వరకు హైదరాబాద్ లోనే చదివింది. ఆమె తల్లితండ్రులు ఇంజనీరింగ్ అనంతరం రోహిణిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలనుకున్నారు. రోహిణి చిన్నప్పటి నుంచి తన అమ్మ శ్రీలక్ష్మీరెడ్డి చేసే సేవా కార్యక్రమాలు చూసి, తాను కూడా ప్రజలకు సేవ చేయాలనుకొని సివిల్స్‌ పైపు మొగ్గు చూపింది. ఆమె హిమాయత్‌నగర్‌లోని ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌లో శిక్షణకు చేరింది.[3]

హాసన్ జిల్లా కలెక్టర్ గా మార్చు

శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరునికి పన్నెండేళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం. సింధూరి హసన్‌ కలెక్టర్ గా వచ్చే నాటికి మస్తకాభిషేకానికి ఆరు నెలల సమయమే ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే మస్తకాభిషేకానికి కావాల్సిన పనులు మొదలు కాలేదు, దీనితో ఆమె పనులను వేగవంతంగా జరగాలని అధికారులకు, వర్క్‌ టెండర్‌లు వేసిన వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు ఆమె. 12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహామస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణీ భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో మంత్రి మంజుకు కలెక్టర్ కు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.

హాసన్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మంజుకి ఆమె ఇలా పని చేయడం నచ్చలేదు. 2018 మస్తకాభిషేకానికి 40 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మహామస్తకాభిషేకం ముగిసింది. మహామస్తకాభిషేకం జయపద్రం కావడంతో జిల్లాలో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. రోహిణి కలెక్టర్ గా జిల్లాలో‌ కొనసాగితే తనకు ఇబ్బంది అని గ్రహించి తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించాడు. బదిలీపై ప్రభుత్వంపై పోరాడి కేసులో గెలిచింది. దీనితో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ఆమెను హసన్ జిల్లా కలెక్టర్‌గా తిరిగి నియమించింది.[4]

రోహిణి హాసన్ జిల్లా కలెక్టర్ గా 2017లో వచ్చే నాటికీ పదవ తరగతి ఉతీర్ణతలో జిల్లా 31వ స్థానంలో ఉంది. ఆమె తీసుకవచిన మార్పుల వాళ్ళ 2019లో పదవ తరగతి ఉతీర్ణతలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

మండ్య జిల్లా పరిషత్ సి.ఈ.ఓ గా మార్చు

రోహిణి మాండ్య జిల్లాలో 2014లో ఏడాదిలోనే లక్ష టాయిలెట్లు నిర్మించి రికార్డు సృష్టించింది. దేశంలోని అత్యధికంగా మరుగుదొడ్లు నిర్మించిన మూడు జిల్లాలలో ఒక జిల్లాగా మాండ్యను నిలిపింది.[5][6]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. [1]
  2. SOLUTIONS, A. CUBE CAREER. "ROHINI SINDHURI DASARI 2008 43 IASPassion.com IAS PASSION | CSAT | UPSC | Civil Services | Preparation | IPS | IRS | IFS | IAS Toppers". IASPassion.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-09-27. Retrieved 2019-09-26.
  3. Sakshi Education (18 November 2020). "ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొని...నేడు ఈ స్థాయికి". www.sakshieducation.com. Archived from the original on 18 November 2020. Retrieved 18 April 2021.
  4. Sakshi, హోం » ఫ్యామిలీ (16 April 2018). "పోరు సింధూరం". Archived from the original on 16 ఏప్రిల్ 2018. Retrieved 18 April 2021.
  5. B. R., Rohith (25 February 2015). "Mandya model is buzzword for clean India drive". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-09-26.
  6. R, Chetan (7 January 2015). "CEO powers a 'toilet revolution' in Mandya". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2019-09-26.