లండన్-కలకత్తా బస్సు సర్వీస్

లండన్-కలకత్తా బస్ సర్వీస్ ప్రపంచంలోనే అతి పొడవైన బస్సు మార్గం

లండన్-కలకత్తా బస్ సర్వీస్ ప్రపంచంలోనే అతి పొడవైన బస్సు మార్గం,[1] [2] [3] ఇది యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్, భారతదేశంలోని కోల్‌కతా మధ్య నడిచింది. 1957లో ప్రారంభించబడిన ఈ బస్సు భారతదేశంలోని కోల్‌కతాలో ప్రారంభమయ్యి, వాయువ్య భారతదేశం, బెల్జియం, యుగోస్లేవియా మీదుగా లండన్‌ చేరుకోవడానికి  50 రోజులు పట్టింది. ఈ బస్సుకు ఇండియామాన్ అని పేరు పెట్టారు, 20 మంది ప్రయాణీకులతో ప్రయాణాన్ని ప్రారంభించారు.[4] ఈ మార్గం పొడవు 10,000 మైళ్లు (16,100 కి.మీ), పోయి రావడానికి 20,300 మైళ్ళు (32,669  కిమీ). 1976 వరకు ఈ మార్గంలో బస్సులు నడిచేవి.[5]1957లో ఒక ప్రయాణానికి 85 పౌండ్లు, 1973లో అది 145 పౌండ్లు అయింది. ఈ ప్రయాణంలో ఆహారం, వసతి కూడా ఉన్నాయి.[3]

లండన్-కలకత్తా బస్సు

మార్గం మార్చు

ఆల్బర్ట్ ట్రావెల్ ద్వారా ఈ బస్సు సర్వీస్ నిర్వహించబడింది.[6] దీని తొలి ప్రయాణం 15 ఏప్రిల్ 1957న లండన్‌లో ప్రారంభమైంది, మొదటి సర్వీస్ 5 జూన్ 1957న కోల్‌కతాకి 50 రోజులలో చేరుకుంది. ఈ ప్రయాణంలో బస్సు ఇంగ్లండ్ నుండి బెల్జియంకు, అక్కడి నుండి పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి చేరుకుంది. భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత, అది న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా కలకత్తా చేరుకుంది.[5]

బస్సులో సౌకర్యాలు మార్చు

ఈ పర్యటనలో ప్రయాణీకుల కోసం పఠన సౌకర్యాలు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక స్లీపింగ్ బంక్‌లు, ఫ్యాన్‌తో పనిచేసే హీటర్‌లు ఉన్నాయి. అన్ని పరికరాలు, సౌకర్యాలతో వంటగది ఉంది. బనారస్, యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్‌తో సహా దారిలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో బస్సును ఆపి చూడడానికి సమయం ఇచ్చేవారు. టెహ్రాన్, సాల్జ్‌బర్గ్, కాబూల్‌, ఇస్తాంబుల్, వియన్నా వంటి నగరాల్లో షాపింగ్ చేయడానికి కూడా సమయం ఇచ్చేవారు.[7]

సర్వీసు నిలిపివేత మార్చు

కొన్నాళ్ల తర్వాత బస్సు ప్రమాదానికి గురై నిరుపయోగంగా మారింది. ఆ తర్వాత బస్సును బ్రిటిష్ యాత్రికుడు ఆండీ స్టీవర్ట్ కొనుగోలు చేశాడు. అతను దానిని డబుల్ డెక్కర్ మొబైల్ హోమ్‌గా పునర్నిర్మించాడు, దీని పేరు ఆల్బర్ట్ గా మార్చబడింది. ఆల్బర్ట్ టూర్స్ కంపెనీ, అక్టోబర్ 8, 1968 న సిడ్నీ నుండి భారతదేశం మీదుగా లండన్‌కు బస్సు సర్వీసును ప్రారంభించింది. బస్సు లండన్ చేరుకోవడానికి దాదాపు 132 రోజులు పట్టింది. బస్సు ఇరాన్ మీదుగా భారతదేశానికి చేరుకుంది, అది బర్మా, థాయిలాండ్, మలేషియా మీదుగా సింగపూర్ వెళ్లింది. సింగపూర్ నుంచి ఓడలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు బస్సును తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిడ్నీకి చేరుకుంది.[8] [9]

లండన్ నుండి కోల్‌కతాకు ఈ సేవకు ఛార్జీ £145. ఈ బస్సు లండన్-కలకత్తా-లండన్, లండన్-కలకత్తా-సిడ్నీ మార్గాలలో కూడా సేవలు అందించింది.[10] ఈ బస్సు కోల్‌కతా నుండి లండన్, మళ్లీ లండన్ నుండి సిడ్నీ వరకు దాదాపు 15 ట్రిప్పులను పూర్తి చేసింది.[11] ఇరాన్‌లో అంతర్యుద్ధం, పాకిస్తాన్, భారతదేశం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా 1976లో ఈ బస్సు సర్వీసు నిలిపివేయబడింది.[12]

మూలాలు మార్చు

  1. "This Was 'World's Longest Bus Route' From Kolkata To London". Curly Tales. 2020-07-06. Retrieved 2020-07-24.
  2. "A Bus Ride From London to Kolkata in 1950s? Yes, The Viral Photo is Real". News18. Retrieved 2020-07-24.
  3. 3.0 3.1 Civic Affairs. Vol. 4. P. C. Kapoor at the Citizen Press. 1957 – via books.google.com.
  4. "Bus to London". Bus to London. Retrieved 2023-06-27.
  5. 5.0 5.1 "പണ്ട് ലണ്ടൻ-കൽക്കട്ട ബസ് സർവീസുണ്ടായിരുന്നു എന്ന് പറഞ്ഞാൽ വിശ്വസിക്കുമോ?". Samayam Malayalam. Retrieved 2023-06-27.
  6. "London to Calcutta by Road? Picture of 1950s Albert Travel Bus Service is Going Viral, Know Details About This Fascinating Historic Journey". Unique News Online. 2020-07-02. Retrieved 2021-02-19.
  7. admin (2020-07-04). "ലണ്ടൻ – കൽക്കട്ട ബസ് റൂട്ട്". News Kerala online. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-24.
  8. "ലണ്ടനിൽ നിന്നു കൽക്കട്ടയിലെത്തിയ ഇന്ത്യാ മാന്‍..." ManoramaOnline. Retrieved 2020-07-31.
  9. INGALIS, LEONARD (1957-08-08). "London-Calcutta Bus is back in London - Owner drove passengers 20,300 Miles". The New York Times.
  10. Eat, Tech Travel (2020-07-03). "ലണ്ടനിൽ നിന്നും ഇന്ത്യയിലെ കൽക്കട്ടയിലേക്ക് ഒരു ബസ് സർവ്വീസ്". Technology & Travel Blog from India. Retrieved 2020-07-31.
  11. "Kolkata, Then Calcutta, Once Had The World's Longest Bus Route All The Way Till London!". Whats Hot. Retrieved 2020-07-31.
  12. K, Noushad K. "ലണ്ടൻ - കൽക്കട്ട ബസ്". Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-31.