లక్ష్మణ్ రుదావత్

లక్ష్మణ్ రుదావత్​ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నర్స్, సామజిక కార్యకర్త. ఆయన నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసిషియేషన్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు.

లక్ష్మణ్ రుదావత్​
Laxman rudavath.jpg
జననం10 మే 1990
వృత్తినర్సింగ్ ఆఫీసర్ , సామజిక కార్యకర్త

జననం, విద్యాభాస్యంసవరించు

లక్ష్మణ్ రుదావత్ 10 మే 1990లో నీల్య‌ రుదావత్, సాలి దంపతులకు తెలంగాణ రాష్ట్రం , నాగర్‌కర్నూల్ జిల్లా , పదర మండలం , ఇప్పలపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఇప్పలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి వరకు చదివాడు. లక్ష్మణ్ హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఝాన్సీ ఉన్నత పాఠశాలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు, రత్న జూనియర్‌ కాలేజీ, ఈసీఐఎల్‌ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి మాసబ్‌ ట్యాంక్‌లోని మహావీర్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో 2011లో నర్సింగ్‌ కోర్స్‌ పూర్తి చేశాడు.[1]

వృత్తి జీవితంసవరించు

లక్ష్మణ్ నర్సింగ్‌ కోర్స్‌ పూర్తయ్యాక ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రెండేండ్లు జనరల్‌ వార్డులో పని చేశాడు.ఆయన తరువాత ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చేఆర్థోపెడిక్‌ స్కర్బ్‌ నర్స్‌గా పని చేస్తున్నాడు.

నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌సవరించు

లక్ష్మణ్ రుదావత్ నర్స్ గా పని చేస్తూనే ఓ స్వచ్ఛంద సంస్థలో సభ్యుడిగా ఉంటూ మారుమూల గ్రామాలు, తండాలు, గిరిజన గూడాల్లో తిరిగి ఎయిడ్స్‌ వ్యాధి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన నర్స్‌గా పని చేస్తూ నర్సింగ్‌ వృత్తిపై ఆసుపత్రి యాజమాన్యాలు చూస్తున్న చిన్నచూపుపై తమ హక్కులకై పోరాడాలని నిశ్చయించుకొని తన సహా ఉద్యోగులతో కలిసి నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటులో కీలకంగా పని చేశాడు. నర్సింగ్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన తరువాత జెండర్‌తో సంబంధ లేకుండా సమాన ఉద్యోగం, రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ స్థాపించాలని, ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నవారికి కనీస హక్కులపై, సినిమాల్లో నర్స్‌లను చూపించే తీరుపై, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రయివేట్‌ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌ నర్సులకు కనీస వేతనలు ఇవ్వాలని అనేక ఉద్యమాలు చేశాడు.[2]

నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసిషియేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం రోజు వారిని ప్రోత్సాహంగా రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేస్తున్నారు. నర్సింగ్​ రంగంలో అతను చేస్తున్న సేవలకు గాను ఇండోనేషియాలోని బాలిలో 2020 మార్చి 20, 21 తేదీల్లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్​ సదస్సుకు లక్ష్మణ్ ఆహ్వానం అందుకున్నాడు.[3]లక్ష్మణ్ నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసిషియేషన్‌ లో వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన కన్వీనర్ గా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[4][5] ఆయన నర్సుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికిగాను మెగా లెజెండరీ 2019 అవార్డును అందుకున్నాడు.[6]

మూలాలుసవరించు

  1. Nava Telangana (8 September 2019). "నర్సుల సాధికారతే లక్ష్యంగా..." Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  2. Andrajyothy (27 October 2019). "అరెస్టు చేసిన నర్సులను విడుదల చేయాలి". Retrieved 6 October 2021.
  3. ETV Bharat News (30 January 2020). "అంతర్జాతీయ నర్సింగ్​ సదస్సుకు లక్ష్మణ్​కు ఆహ్వానం". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021. {{cite news}}: zero width space character in |title= at position 20 (help)
  4. Mana Telangana (26 June 2019). "వైద్య, ఆరోగ్య శాఖలో 1036 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  5. The Times of India (6 July 2020). "As Covid spikes, Hyderabad hospitals fly in nurses from Kerala | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  6. Dharuvu (2019). "మెగా లెజెండరీ అవార్డ్ అందుకున్న లక్ష్మణ్ రూడవత్." Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.