లక్ష్మీకాంత్ పర్సేకర్

గోవా రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన లక్ష్మీకాంత్ పర్సేకర్ జూలై 4, 1956న జన్మించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మీకాంత్ 2014, నబంవరు 8న గోవా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.

లక్ష్మీకాంత్ యశ్వంత్ పర్సేకర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-04) 4 జులై 1956 (వయస్సు 64)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

లక్ష్మీకాంత్ పర్సేకర్ 1956, జూళై 4న గోవాలోని హార్మల్ గ్రామంలో జన్మించారు. 1980లో పనాజీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు. 1981లో బీఎడ్ కూడా పూర్తిచేసి హార్మల్ పంచక్రోషి పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానంసవరించు

విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వైపు ఉన్న పర్సేకర్ 1999, 2002లలో గోవా శాసనసభ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందిననూ 2007, 2012లలో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారు. 2014 నవంబరులో గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రిగా నియమితులు కావడంతో ఈయనకు ముఖ్యమంత్రి పదవి వరించింది.

మూలాలుసవరించు