లక్ష్మీనారాయణ రాందాస్
అడ్మిరల్ లక్ష్మీనారాయణ రాందాస్ (5 సెప్టెంబర్ 1933 - 15 మార్చి 2024) భారతదేశానికి చెందిన భారత నావికాదళం మాజీ చీఫ్, మానవ హక్కుల కార్యకర్త. ఆయన 1990 నుండి 1993 వరకు నావికాదళానికి 13వ చీఫ్‌గా పని చేశాడు. లక్ష్మీనారాయణ్ రాందాస్1953 నుంచి 1993 వరకు భారత నౌకా దళంలో వివిధ హోదాల్లో పని చేసి 1971లో భారత్-పాక్ యుద్ధంలోనూ నౌకాదళ అధికారిగా కీలక పాత్ర పోషించాడు. అందుకుగాను భారత ప్రభుత్వం ఆయన్ను వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. రాందాస్ 1990 జనవరి 30న 13వ భారత నౌకాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన నావికాదళంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
లక్ష్మీనారాయణ రాందాస్ | |||
నవంబర్ 2016లో ఢిల్లీలో అడ్మిరల్ రాందాస్ | |||
పదవీ కాలం 1 డిసెంబర్ 1990 - 30 సెప్టెంబర్ 1993 | |||
ముందు | జయంత్ గణపత్ నాదకర్ణి | ||
---|---|---|---|
తరువాత | విజయ్ సింగ్ షెకావత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొంబాయి, బొంబాయి ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | 1933 సెప్టెంబరు 5||
మరణం | 2024 మార్చి 15[1] సికింద్రాబాద్, తెలంగాణ, భారతదేశం | (వయసు 90)||
జీవిత భాగస్వామి | లలితా రాందాస్ | ||
పురస్కారాలు | పరమ విశిష్ట సేవా పతకం అతి విశిష్ట సేవా పతకం వీర్ చక్ర విశిష్ట సేవా పతకం రామన్ మెగసెసే అవార్డు |
మరణం
మార్చులక్ష్మీనారాయణ్ రాందాస్ 90 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్య పొందుతూ 2024 మార్చి 15న మరణించాడు.[2] ఆయన అంత్యక్రియలు మార్చి 16న సికింద్రాబాద్, తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గ వాటికలో సైనిక లాంఛనాలలో నిర్వహించారు.[3] ఆయనకు భార్య లలిత రాందాస్, ముగ్గురు కుమార్తెలు కవిత, సాగరి, మల్లికా ఉన్నారు.[2][4][5]
మూలాలు
మార్చు- ↑ "Hero of 1971 Indo- Pak war & former Navy chief Admiral Ramdas dies at 90". The Times of India. 16 March 2024. Retrieved 17 March 2024.
- ↑ Andhrajyothy (17 March 2024). "నేవీ మాజీ చీఫ్ రాందాస్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ Eenadu (16 March 2024). "అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రాందాస్ ఇక లేరు". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.